Home /News /jobs /

AMAZON GOING TO SET UP NEW SKILL CENTRE AND OFFER FREE AWS TRAINING KNOW DETAILS EVK

Amazon AWS Training Courses: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త ఏడబ్ల్యూఎస్ స్కిల్ సెంట‌ర్‌కు అమెజాన్ క‌స‌ర‌త్తు

అమెజాన్‌ను (image: Amazon)

అమెజాన్‌ను (image: Amazon)

Amazon AWS Training Courses: నిరుద్యోగుల‌కు మెరుగైన అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి అమెజాన్ (Amazon) మ‌రో నిర్ణ‌యం తీసుకొంది. ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్(Cloud Computing) నైపుణ్యాల శిక్షణ తీసుకోవాల‌నుకొన్న వారికి AWS స్కిల్ బిల్డర్‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...
  నిరుద్యోగుల‌కు మెరుగైన అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి అమెజాన్ (Amazon) మ‌రో నిర్ణ‌యం తీసుకొంది. ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్(Cloud Computing) నైపుణ్యాల శిక్షణ తీసుకోవాల‌నుకొన్న వారికి AWS స్కిల్ బిల్డర్‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 2025 నాటికి 200 కంటే ఎక్కువ దేశాలో అన్ని స్థాయిల జ్ఞానంతో పాటు అన్ని రంగాల నుంచి 29 మిలియన్ల మందికి అవగాహన కల్పించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు స‌మాచారం. AWS స్కిల్ బిల్డర్ కొత్త డిజిటల్ లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ చెబుతుంది. నవంబర్ 18, 2021న అమెజాన్ నాలుగు కార్యక్రమాలను ప్రకటించింది. అవే AWS స్కిల్ బిల్డర్‌తోపాటు అమెజాన్ వెబ్‌సైట్‌కు AWS కోర్సుల జోడింపు, AWS రీ/స్టార్ట్ గ్లోబల్ రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను విస్తరించడం, AWS స్కిల్స్ సెంటర్‌ను ప్రారంభించడంగా పేర్కొంది.

  ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌ (Cloud Computing) ఒకటిగా నిలుస్తోంది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో.. భవిష్యత్తులో మనుషుల అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

  National Scholarship: వారం రోజులే గ‌డువు.. రూ.70వేల స్కాల‌ర్‌షిప్‌ పొందేందుకు అప్లై చేసుకోండి


  అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగావకాశాలు పొందొచ్చు. తాజాగా అమెజాన్ వెబ్ (Amazon Web) సర్వీసెస్ (AWS) కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌ ప్రాముఖ్యతను నిరుద్యోగులకు తెలియజేసేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎడబ్ల్యుఎస్ (AWS) /స్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా 12 వారాల క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ఎలాంటి టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌/స్కిల్స్ అవసరం లేదు.

  అర్హతలు

  1. అభ్యర్థులు 12 వారాల కోర్స్‌ వ్యవధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హాజరు కావడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి.

  2. ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫుల్ టైం జాబ్ చేయగలగాలి.

  3. దరఖాస్తుదారుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ లో కెరీర్ ని తప్పకుండా ప్రారంభించాలనే ఆసక్తి ఉండాలి.

  DCCB Recruitment 2021: నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000


  4. అభ్యర్థులు హైస్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎక్వివలెన్సీ డిప్లొమా (GED) కలిగి ఉండాలి.

  అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్.. పార్టిసిపెంట్లను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ పరీక్షకు సిద్ధం చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఖర్చులను కూడా భరిస్తుంది. ఇక్కడ నేర్చుకున్న క్లౌడ్ స్కిల్స్ సర్టిఫికేషన్ (Certification) ఎక్కడైనా సరే వాలీడ్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చెన్నై, కోల్కతా, ముంబై, పూణే, తిరువనంతపురం సిటీల నుంచి నిర్వహిస్తారు. ఎడ్యూబ్రిడ్జి లెర్నింగ్, ఎడ్యూజాబ్స్ అకాడమీ వంటి ఐదు స్థానిక విద్యా సంస్థలతో కలిసి వర్చువల్ ట్రైనింగ్ అందించనున్నారు.

  "క్లౌడ్ కంప్యూటింగ్‌ నేర్చుకున్న వ్యక్తులకు మంచి డిమాండ్ ఉంది కానీ ఈ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నారు. క్లౌడ్ సేవలను అందించగల టాలెంటెడ్ ఉద్యోగులు దొరక్క చాలా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సాంకేతికతలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం అత్యవసరం. అందుకే రీ/స్టార్ట్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టాం" అని అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్(AISPL) ఎడబ్ల్యుఎస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇండియా హెడ్ అమిత్ మెహతా పేర్కొన్నారు.

  ఈ కోర్సు గురించి మరిన్ని వివరాల కోసం https://aws.amazon.com/training/restart/ లింక్ ను విజిట్ చేయవచ్చు.

  రీ/స్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా 12 వారాల క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Amazon, EDUCATION, Online Education

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు