Home /News /jobs /

Amazon: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అమెజాన్ గుడ్ న్యూస్.. సరికొత్త ప్రోగ్రామ్​ మీ కోసమే.. పూర్తి వివరాలు..!

Amazon: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అమెజాన్ గుడ్ న్యూస్.. సరికొత్త ప్రోగ్రామ్​ మీ కోసమే.. పూర్తి వివరాలు..!

Amazon

Amazon

Amazon: ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ (Amazon Latest Telugu News) కేవలం వ్యాపారంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుంది.

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ (Amazon Latest Telugu News) కేవలం వ్యాపారంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. అమెజాన్​ తాజాగా గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్​ పట్ల అవగాహన కల్పించేందుకు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అమెజాన్​ ఫ్యూచర్ ఇంజనీర్​ (ఏఎఫ్​ఈ) పేరుతో గ్లోబల్​ కంప్యూటర్ సైన్స్​ ఎడ్యుకేషన్​ ప్రోగ్రామ్​ను లాంచ్​ చేసింది. ఈ ప్రోగ్రామ్​ ద్వారా గ్రామీణ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్​ సైన్స్​ విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో వారు మెరుగైన ఉద్యోగావకాశాలు పొందేందుకు సహాయం చేస్తారు. తొలి ఏడాది ఏడు రాష్ట్రాల్లోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 1 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్​లో అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలలను ఎంపిక చేస్తారు. రాబోయే కాలంలో మరిన్ని రాష్ట్రాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు.

తొలుత 900 ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలల్లో అమలు..

అమెజాన్​ ఫ్యూచర్​​ ఇంజనీర్​ కార్యక్రమంలో 6 నుంచి 12 తరగతి విద్యార్థులకు సైన్స్​ ఎడ్యుకేషన్​పై బోధన ఉంటుంది. కోడింగ్​ మూల సిద్దాంతాలు, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషిన్​ లెర్నింగ్​, నేచురల్​ లాంగ్వేజ్​ ప్రాసెసింగ్​ (వాయిస్​ టెక్నాలజీ) వంటి భవిష్యత్​ సాంకేతిక కోర్సులను భారతీయ ప్రాంతీయ భాషల్లో బోధిస్తారు. ఈ ప్రోగ్రామ్​ కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాదు. దీని ద్వారా అమెజాన్​ నిపుణులను కలిసే అవకాశం కూడా ఉంటుంది.

ఇది కూాడా చదవండి : అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..? రెండు గ్రూపులుగా జట్టు.. కోహ్లీపై సీనియర్లు గుస్సా..!

మరోవైపు, అమెజాన్​ సైబర్​ రోబోటిక్స్​ ఛాలెంజ్​ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్​ బేసిక్స్, కోడింగ్​ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్​ షిప్స్​, హాకథాన్స్​లో పాల్గొనే అవకాశాలను పొందవచ్చు. భారత గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్​ సైన్స్ నేర్పించేందుకు అంతర్జాతీయ నాలెడ్జ్​ పార్ట్​నర్​ కోడ్.ఓఆర్​జీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అమెజాన్​ పనిచేస్తోంది.

ఇది కూాడా చదవండి : బూతులు తిట్టడంటూ బీసీసీఐకి కోహ్లీపై ఫిర్యాదు చేసింది ఆ సీనియర్ ప్లేయరే..! ఎవరంటే..

ఈ ప్రోగ్రామ్​పై అమెజాన్​ ఇండియా హెడ్​ అమిత్​ అగర్వాల్​ మాట్లాడుతూ ‘‘నేటి ఉపాధి రంగంలో కంప్యూటర్​ సైన్స్​ కీలకంగా మారింది. అందుకే కంప్యూటర్​ సైన్స్​పై పాఠశాల స్థాయిలోనే పట్టు సాధించడం చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అర్థమయ్యేలా స్థానిక భాషలోనే బోధించనున్నాం. తద్వారా విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది” అని పేర్కొన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon, AMAZON INDIA, Computer science, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు