Home /News /jobs /

AMAZON BUMPER OFFER 4 HOURS WORK 60 THOUSAND EARNINGS PRV

j‌obs in Amazon: 4 గంటలు పని.. రూ. 60 వేలు సంపాదించండి.. అప్లై ఎలా చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజుకు 100 నుంచి 150 పార్శిల్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ చేయాల్సిన కస్టమర్ అడ్రస్ గోడైన్ నుంచి 10 నుండి 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ డెలివరీలను 4 నుంచి 5 గంటల సమయంలో చేరవేసే లక్ష్యంతో పనిచేయాలి. సకాలంలో చేరవేసేందుకు ప్రయత్నించాలి. డెలివరీ సమయం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 గంటలకల్లా ముగించాలి.

ఇంకా చదవండి ...
    నిరుద్యోగులకు అమెజాన్ (Amazon) సంస్థ ఓ మంచి అవకాశం కల్పిస్తోంది. కొద్ది సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించే ఛాన్స్ ప్రజలకు ఇస్తోంది. మీకు వీలున్న సమయంలో పనిచేయడం ద్వారా నెలకు రూ. 55వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించొచ్చు. అయితే కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయడం ద్వారా నెలకు రూ.60 వేల వరకు సంపాదించే అవకాశం కల్పించింది. ఇలాంటి ఆఫర్ ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇవ్వదు. అమెజాన్ భారత్​లో శరవేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఒక ప్రాడక్ట్ డెలివరీ సమయం చేసే సమయం వీలైనంత తక్కువగా ఉండాలనే ఆలోచనతో ఉంది. ఇందుకోసం చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్ల ఇంటికి డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్(delivery boy) తప్పనిసరిగా ఉండాలి. ముందుగా గోడౌన్ నుంచి ప్రాడక్ట్ కలెక్ట్ చేసిన తర్వాత కస్టమర్​కు ఆ వస్తువుని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇంతకు నాలుగు గంటలు ఏంటి.. ఎన్ని వస్తువులు డెలివరీ చేయాలి.. నిబంధనలు ఏంటి?. అనేది తెలుసుకుందాం..

    పని గురించి చూద్దాం..

    రోజుకు 150 పార్శిల్స్ డెలివరీ ... అమెజాన్ సూచించిన ప్రకారం ... డెలివరీ బాయ్ గోడౌన్ నుంచి కస్టమర్ అడ్రస్​కు డెలివరీ ఇవ్వాలి. డెలివరీ చేయాల్సిన కస్టమర్ అడ్రస్ గోడైన్ నుంచి 10 నుండి 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ డెలివరీలను 4 నుంచి 5 గంటల సమయంలో చేరవేసే లక్ష్యంతో కనీసం 100 నుంచి 150 చేరవేసేలా పనిచేయాలి. సకాలంలో చేరవేసేందుకు ప్రయత్నించాలి. డెలివరీ సమయం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 గంటలకల్లా ముగించాలి. అయితే మీకు నచ్చిన సమయంలో ఈ పనిని ప్రారంభించి పూర్తి చేయొచ్చు. డెలివరీ బాయ్‌గా మీకు పని సామర్థ్యం ఉంటే మీరు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని అమెజాన్ గోడౌన్ సందర్శించి అక్కడ మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోండి. లేదా ఆమెజాన్​ వెబ్​సైట్​ (logistics.amazom.com)లో లాగిన్​ అయి.. వివరాలు నమోదు చేసుకోండి.. అయితే డెలివరీ బాయ్​కు ఉండాల్సిన అర్హతలను కూడా అమెజాన్ ఇండియా సంస్థ తెలిపింది. అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టింది. పాఠశాల లేదా కాలేజ్ విద్యను పూర్తి చేసిన వారు అందుకు సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే డెలివరీ కోసం సొంత బైక్​ లేదా స్కూటర్ కలిగి ఉండాలి. ద్విచక్రవాహనంకు తప్పనిసరిగా ఇన్‌స్యూరెన్స్‌తో పాటు ఆర్​సీ, లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

    జీతభత్యాల సంగతి చూస్తే..

    డెలివరీ బాయ్​లకు ప్రతి నెల రెగ్యులర్​ జీతం వస్తుంది. అంటే నెలకు రూ .12 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది. అయితే డెలివరీ చేసే ఒక వస్తువుపై రూ .10 ఇన్సెంటివ్‌గా ఇస్తారు. అంటే రోజుకు 150 పార్శిళ్లను కస్టమర్ల అడ్రస్ ప్రజలకు డెలివరీ చేస్తే రోజుకు రూ .1,500 వస్తుంది. నెలకు సంపాదన రూ .45 వేలు అవుతుంది. ఇక జీతం ఎలాగో రూ. 12 నుంచి రూ .15 వేల వరకు వస్తుంది కాబట్టి ఈ మొత్తం రూమ్ .60 వేలకు చేరుతుంది. పెట్రోల్ ఛార్జీలను డెలివరీ బాయ్ సొంత జేబు నుంచే భరించాల్సి ఉంటుంది.  చిన్న సంస్థలను ప్రోత్సహిస్తున్న అమెజాన్ సంస్థ ఎంఎస్​ఎంఈలను కూడా ప్రోత్సహిస్తోంది. వాటికి వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తోంది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ ఈవెంట్ తరువాత జూలై 26-27వ తేదీల్లో నిర్వహించారు. 100 కు పైగా చిన్, మధ్యతరహా వ్యాపారవేత్తలకు విక్రయ అవకాశాలను కల్పించింది. ఇందులో లాన, గార్డెన్, కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఇల్లు మరియు వంటగది సామాన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రాడక్ట్స్, జ్యువెలరీ, మరియు స్టేషనరీలతో సహా 2400 వినియోగదారులకు పైగా అమెజాన్​ అమ్మకానికి పెట్టింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Amazon, Food delivery, Home delivery, Job, Job less workers, Work

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు