ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునే పనిని వేగవంతం చేస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon) కూడా ఉద్యోగుల్ని తగ్గించుకునే పనిలో పడింది. భారీగా లేఆఫ్స్ (layoffs) ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తమ రిటైల్, డివైజెస్, హ్యూమన్ రిసోర్స్ విభాగాల నుంచి కొందరు ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియను అమలు చేస్తున్న ఈ సంస్థ.. నవంబర్ 29లోపు వాలంటరీ రిజైన్ చేయాలని కొందరు ఉద్యోగులను కోరుతున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం కాలిఫోర్నియాలోని రీజనల్ అథారిటీలకు అమెజాన్ ఓ రిపోర్ట్ పంపించింది. దాని ప్రకారం.. డేటా సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర కార్పొరేట్ వర్కర్లలో మొత్తం 260 మందిని తీసువేస్తున్నారు. ఆ ఉద్యోగాల కోతలు జనవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే CNBC సేకరించిన ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ప్రకారం, అమెజాన్ అనేక విభాగాల్లో కొంతమంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని కోరుతూ వాలంటరీ సెవరెన్స్ (voluntary severance) ఆఫర్లను పంపుతున్నట్లు తెలుస్తోంది.
Dream 11: టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి డ్రీమ్ 11 సీఈఓ బంపరాఫర్.. ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన
అయితే ఈ విషయంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అమెజాన్ తమ ఉద్యోగులను అడగడం లేదు. దీని కోసం కొంత సమయాన్ని ఇచ్చింది. ఉద్యోగులు వాలంటరీ రిజిగ్నిషన్స్పై నవంబర్ 29 వరకు తమ నిర్ణయం చెప్పవచ్చని సీఎన్‌బీసీ రిపోర్ట్ పేర్కొంది. ఈ విషయంపై ఉద్యోగులు తమ మనసు మార్చుకుంటే, డిసెంబర్ 5 వరకు తమ అప్లికేషన్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
రివ్యూల తర్వాత తాము కొన్ని టీంలను కలిపేయాలని అనుకుంటున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై నవంబర్ 16కు ముందు అమెజాన్ డివైజెస్ & సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ లింప్ ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు. పై చర్యలతో కొన్ని రోల్స్ ఇకపై అవసరం ఉండబోవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో తాము ‘డివైజెస్ అండ్ సర్వీసెస్’ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని కోల్పోనుండటం బాధ కలిగిస్తోందన్నారు. ఎవరైనా కొత్త రోల్స్‌లో ఉపయోగపడతారనుకుంటే వారిని ఆ రోల్‌లోకి తీసుకుంటామన్నారు. సరిపడే రోల్ లేకపోతే వారికి అన్ని విధాలా సపోర్ట్ ఇస్తామన్నారు. ఎవరెవరికి లేఆఫ్ ఇస్తున్నామో మంగళవారం తెలిపామన్నారు. తీసివేసే సమయంలో వారికి చెల్లింపులు చేస్తామని తెలిపారు.
అమెజాన్ లేఆఫ్స్‌పై న్యూయార్క్ టైమ్స్ ఈ వారం ఓ కథనాన్ని ప్రచురించింది. కార్పోరేట్, టెక్నాలజీ విభాగాల్లో అమెజాన్ సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని, ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యలో అది మూడు శాతం అని పేర్కొంది. యాన్యువల్ ప్లానింగ్ రివ్యూలో కొన్ని రోల్స్ అవసరం లేదని భావిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ చెప్పినట్లు రిపోర్ట్ వెల్లడించింది. కోవిడ్ -19 సమయంలో చాలామంది దుకాణదారులు ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేశారని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కెల్లీ నాంటెల్ చెప్పారు. దీంతో ఆదాయం తగ్గడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, JOBS, Layoffs, Private Jobs