Jobs in Amazon: అమెజాన్‌లో జాబ్ మేళా.. 50,000 పైగా ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్(E Commerce) దిగ్గజం అమెజాన్(Amazon) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రానున్న నెలల్లో 55 వేల నూతన నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    కరోనా దెబ్బకు అనేక మంది ఉద్యోగాలు (Jobs) కోల్పోయి వీధిన పడ్డారు. చాలా మంది ఫ్రెషర్స్ అయితే నియామకాలు (Recruitments) లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు. అయితే కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో నియామకాలు జోరందుకోవడంతో అలాంటి వారిలో మళ్లీ కాస్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 55 వేల మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ఉద్యోగాల్లో 40 వేల నియామకాలు అమెరికాలో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. మిగతా ఉద్యోగాలు ఇండియాతో పాటు జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ(Andy Jassy) రాయిటర్స్ కు తెలిపారు.

    ఆయన జూలైలో అమెజాన్ సీఈఓ పదవీ చేపట్టిన అనంతరం తన మొదటి పత్రికా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియామకాల కోసం ఇది మంచి సమయమని భావిస్తున్నారన్నారు. "ఈ కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా మారిన సంగతి తెలిసిందే. నూతన, డిఫెరెంట్ గా ఉండే ఉద్యోగాల కోసం గురించి అనేక మంది ఆలోచిస్తున్నారు" అని అన్నారు.  ప్రాజెక్ట్ కైపర్ అని పిలిచే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడానికి, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సంస్థకు చాలా మంది అవసరమని వివరించారు.
    Bank of Maharashtra Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    కొత్తగా చేపట్టనున్న 55 వేల నియామకాల వల్ల అమెజాన్ టెక్, కార్పొరేట్ సిబ్బంది 20 శాతం పెరగనున్నారని జాస్సీ చెప్పారు. ఇదిలా ఉంటే అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం అమెజాన్ లో ప్రపంచ వ్యాప్తంగా 2,75,000 మంది పనిచేస్తున్నారని సంస్థ తెలిపింది. అమెజాన్ కు సంబంధించిన ఉద్యోగాల వివరాలను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
    UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు

    ఇదిలా ఉంటే ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో కూడా ఫ్రెషర్స్ కు శుభవార్త చెప్పింది. ఫ్రెషర్స్‌ని నియమించేందుకు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) నిర్వహిస్తోన్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్స్ కోసం విప్రో నిర్వహిస్తున్న స్పెషల్ హైరింగ్ ప్రోగ్రామ్ ఇది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ (B Tech Final Year) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.

    అంటే 2022 సంవత్సరంలో అభ్యర్థులు బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్‌కు విప్రో ఆఫర్ లెటర్స్ (Offer Letters) ఇవ్వనుంది విప్రో. ఎంపికైన అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే వీరిలో 22,000 మంది ఉద్యోగాల్లో చేరతారని విప్రో భావిస్తోంది. అభ్యర్థులు లింక్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: