ఐఐటీ జేఈఈ కోర్సుల కోసం ప్రిపేర్ అవుతున్న ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. అమెజాన్ అకాడమీ ఉచితంగా కోర్సుల్ని అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెజాన్ ఇండియాలో అమెజాన్ అకాడమీ పేరుతో ఓ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్ కూడా ప్రారంభించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. నిపుణులైన జేఈఈ టీచర్స్‌తో లైవ్ సెషన్స్ కూడా అందిస్తోంది. అమెజాన్ అకాడమీలో ఎన్‌రోల్ చేయాలంటే https://academy.amazon.in/ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ ఉచితం. గూగుల్ ప్లే స్టోర్‌లో అమెజాన్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఎన్‌రోల్ చేయొచ్చు. కొన్ని నెలల పాటు మొత్తం కంటెంట్ ఉచితంగా అందిస్తున్నామని అమెజాన్ అకాడమీ ప్రకటించింది. విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు
Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫాన్‌లో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది. లైవ్ ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావొచ్చు. మాక్ టెస్టుల్లో పాల్గొనొచ్చు. నిపుణుల సారథ్యంలో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు. రియల్ టైమ్‌లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అమెజాన్ అకాడమీ నిర్వహించే జేఈఈ మాక్ టెస్టులకు హాజరై ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసుకోవచ్చు. భారతదేశంలో జేఈఈ రాయాలనుకుంటున్నవారితో పోటీపడటంతో పాటు తమ స్కోర్స్ కంపేర్ చేసుకోవచ్చు.
Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Education Loan: చదువుకోవడానికి లోన్ కావాలా? ఏ బ్యాంకులో వడ్డీ తక్కువో తెలుసుకోండి
అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో జేఈఈ టెస్ట్ ఏ సమయంలో అయినా రాయొచ్చు. పర్ఫామెన్స్ రిపోర్ట్స్ పొందొచ్చు. ఫుల్ టెస్ట్, పార్ట్ టెస్ట్, చాప్టర్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. విద్యార్థులు తమ స్థాయి తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. జేఈఈ సిలబస్ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందుకోసం అమెజాన్ అకాడమీ క్వశ్చన్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. 15,000 పైగా ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ కూడా ఉంటుంది. అంతే కాదు జేఈఈ ఎగ్జామ్‌లో సులువుగా సమాధానాలు రాసేందుకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకోవచ్చు. నిపుణుల నుంచి ఎగ్జామ్ టిప్స్ కూడా లభిస్తాయి.
ఇండియాలో ఇప్పటికే అన్‌అకాడమీ, టాపర్, బైజూస్ లాంటి ఎడ్ టెక్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ కోసం ఈ ప్లాట్‌ఫామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వారికి పోటీగా అమెజాన్ అకాడమీ దూసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.