ప్రఖ్యాత స్వీడీష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం.. 1901 నుంచి నోబెల్ బహుమతులను ప్రధానం చేస్తున్నారు. భౌతిక, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి ఈ బహుమతిని అందజేస్తారు. ఈ రంగాల్లో విశేష సేవలందించేవారికి నోబెల్ బహుమతులు అందజేయాలని 1895లో ఆయన వీలునామాలో రాసిన దాని ప్రకారం.. వీటిని ప్రతి ఏడాది ప్రకటిస్తున్నారు. 1968 నుంచి దీనిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అందజేస్తున్నది.
ఆరు రంగాల్లో ఇచ్చే ఆరు బహుమతులను ప్రతి యేటా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న స్వీడన్ లోని స్టాక్ హోంలో ఇస్తారు. దీని కింద ఇచ్చే నగదు ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంటుంది. ఒక సంవత్సరంలో ఇవ్వని పారితోశకాన్ని తిరిగి తర్వాత ఏడాదికి బదిలీ చేస్తారు.
నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించిన నుంచి ఇప్పటిదాకా మొత్తం 597 బహుమతులను...950 మందికి అందజేశారు. ఫిజిక్స్ లో అత్యధికంగా 113 నోబెల్స్ ఇవ్వగా.. కెమిస్ట్రీ (111), మెడిసిన్ (110), సాహిత్యం (112), శాంతి (100), ఆర్థిక శాస్త్రంలో 51 సార్లు నోబెల్ ను ప్రకటించారు. ఇందులో 923 మంది గ్రహీతలు.. 27 సంస్థలు నోబెల్ ను పొందాయి.
కాగా, ప్రపంచ యుద్ధాల కారణంగా మధ్యలో కొన్నేండ్లు వీటిని ప్రకటించలేదు. ఇవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 49 సార్లు నోబెల్ ను ప్రకటించలేదు.
అందరి కంటే చిన్న వయసులో నోబెల్ ను అందుకున్నది పాకిస్థాన్ కు చెందిన యూసుఫ్ మలాలా జాయ్.. నోబెల్ అందుకున్నప్పుడు ఆమె వయసు 17 ఏండ్లు. నోబెల్ (శాంతి బహుమతి) తీసుకున్న అత్యదిక వయసు (97) గల వ్యక్తి జాన్.బి. గుడెనఫ్ (కెమిస్ట్రీ- 2019).
ఇప్పటిదాకా 54 మంది మహిళలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. రెండుసార్లు నోబెల్ అందుకున్న ప్రముఖులు.. జె. బార్డెన్ (ఫిజిక్స్.. 1956 లో, 1972 లో) మేడమ్ క్యూరీ (ఫిజిక్స్ 1903, 1911).. ఎల్.పాలింగ్ (కెమిస్ట్రీ-1954, 1962) ఎఫ్. సంగర్ (కెమిస్ట్రీ 1958, 1980) ఐసీఆర్సీ (శాంతి 1917, 1944, 1963) యూఎన్ హెచ్సీఆర్ (శాంతి 1954, 1981)
మెడిసన్, ఫిజియాలజీలో నోబెల్ :
ఈ రంగంలో నోబెల్ గ్రహితల సగటు వయసు 58. 1901 నుంచి ఇప్పటిదాకా 222 మంది గ్రహీతలకు. 111 బహుమతులు అందజేశారు. నోబెల్ కమిటీ ఒక అవార్డుకు ఒకరి నుంచి ముగ్గురి దాకా నామినేట్ చేస్తుంది. ఫిజియాలజీలో నోబెల్ అందుకున్నవారిలో ఫ్రెడరిక్ జి బెంటింగ్ (32) అత్యంత పిన్న వయస్కుడు. పీటన్ రౌస్ (87) వృద్ధుడు. ఇక ఫిజియాలజీ, వైద్యశాస్త్రంలో 12 మంది మహిళలు నోబెల్ ను అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nobel Peace Prize, Nobel Prize