హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

తెలంగాణలో అమరరాజా సంస్థ రూ.9500 కోట్ల పెట్టుబడులు.. 4500 మందికి జాబ్స్.. ఎక్కడంటే?

తెలంగాణలో అమరరాజా సంస్థ రూ.9500 కోట్ల పెట్టుబడులు.. 4500 మందికి జాబ్స్.. ఎక్కడంటే?

ఒప్పందం చేసుకుంటున్న సంస్థ ప్రతినిధులు

ఒప్పందం చేసుకుంటున్న సంస్థ ప్రతినిధులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. బ్యాటరీల తయారీలో అగ్రగ్రామిగా ఉన్న అమర రాజా గ్రూపుకు చెందిన అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar (Mahabubnagar) | Hyderabad

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. బ్యాటరీల తయారీలో అగ్రగ్రామిగా ఉన్న అమర రాజా గ్రూపునకు (Amara Raja Group) చెందిన అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడులు (Telangana Investments) పెట్టనున్నట్లు ప్రకటించింది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహబూబ్‌నగర్‌లోని (Mahabubnagar) దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ఫ్యాక్టరీలో 4,500 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ అమర రాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ రూ.9500 కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడం గొప్ప విషయమన్నారు.

తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. 37 ఏళ్లుగా అమర రాజా సంస్థ సేవలు అందిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను అన్ని వసతులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. మహబూబ్ నగర్ కు అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

వలసలు పోయే దశ నుంచి ఉద్యోగాలు అందించే స్థాయికి మహబూబ్ నగర్ చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ లో అమర్ రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పడం హర్షనీయమన్నారు.

First published:

Tags: Investments, JOBS, Mahabubnagar, Minister ktr, Private Jobs

ఉత్తమ కథలు