Home /News /jobs /

ALLEN COACHING INSTITUTE DECLARED THEIR STUDENT TOPS JEE MAIN 2022 SESSION 1 WITH FULL MARKS SS

JEE Main 2022: "మా స్టూడెంట్ జేఈఈ టాపర్"... ఫలితాలు రాకముందే ట్వీట్ చేసిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్

JEE Main 2022: "మా స్టూడెంట్ జేఈఈ టాపర్"... ఫలితాలు రాకముందే ట్వీట్ చేసిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్
(image: ALLENkota / Twitter)

JEE Main 2022: "మా స్టూడెంట్ జేఈఈ టాపర్"... ఫలితాలు రాకముందే ట్వీట్ చేసిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ (image: ALLENkota / Twitter)

JEE Main 2022 | జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలు ఇంకా విడుదల కాకముందే ఓ ఇన్‌స్టిట్యూట్ తమ విద్యార్థి జేఈఈ టాపర్ (JEE Topper) అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది.

ఏ పరీక్ష ఫలితాలు వచ్చినా న్యూస్ పేపర్ నుంచి టెలివిజన్ వరకు... కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల ప్రకటనలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కొన్నేళ్లుగా ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్టుంది. ఫలితాలు రాకముందే తమ విద్యార్థి టాపర్‌గా నిలిచినట్టు ప్రకటనలు ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇదే పని చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్ 1 2022 ఫలితాలు విుదల చేయకముందే అల్లెన్ (Allen) కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమ విద్యార్థి స్నేహా పరీక్‌కు 300 మార్కులకు 300 మార్కులు వచ్చాయంటూ ప్రకటనలు విడుదల చేసింది. తమ ఇన్‌స్టిట్యూట్ అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అయితే క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్, ఎన్‌టీఏ విడుదల చేసిన జవాబుల ప్రకారం ఈ మార్కులు వచ్చినట్టు ట్వీట్‌లో వివరించింది. అయితే స్టూడెంట్ ఫోటో చూసినవారికి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆ స్టూడెంట్‌కు 100 శాతం మార్కులు వచ్చాయనే అనిపిస్తుంది. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.


ఫలితాలు రాకముందే తమ స్టూడెంట్‌కు 100 శాతం మార్కులు వచ్చాయంటూ ఇలా ప్రకటనలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాదన ప్రకారం ఆ స్టూడెంట్‌కు 300 మార్కులకు 300 మార్కులు వచ్చాయని, జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షల్లో మొదటి ర్యాంక్ రావడం ఖాయమని చెబుతుండటం విశేషం. ఈ అమ్మాయి కోటాలోని తమ ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్లుగా రెగ్యులర్ విద్యార్థిగా ఉన్నట్టు అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ వివరించింది.

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు

ఇటీవల కోటాలో పలు ఎడ్ టెక్ ప్లాట్‌ఫామ్స్ ఫిజికల్ క్లాస్‌రూమ్స్ ప్రారంభిస్తున్నాయి. దీంతో అల్లెన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమ పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల అల్లెన్ కో-ఫౌండర్, డైరెక్టర్ బ్రజేష్ మహేశ్వరి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అల్లెన్ ఇన్‌స్టిట్యూట్‌ను వదిలివేసే ఉపాధ్యాయులను బెదిరించేలా ఈ వీడియో ఉండటం చర్చనీయాంశమైంది.

Jobs in TCS: బీఏ, బీకామ్ పాసయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా


ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ అయిన అన్‌అకాడమీ కోటా సెంటర్ల కోసం 30 టాప్ ఎడ్యుకేటర్స్‌ని నియమించుకుంటోంది. వారిలో మోహిత్ భార్గవ, పర్వేజ్ ఖాన్, ఇన్సాఫ్ అలీ, విజయ్ కుమార్ త్రిపాఠి, ఆశిష్ గుప్తా లాంటి వారు ఉన్నారు. ఇక అల్లెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ విషయానికి వస్తే ఈ సంస్థలో 10,000 పైగా టీచర్స్ ఉన్నారు. ఈ సంస్థను 1988 ఏప్రిల్ 18న రాజేష్ మహేశ్వరి ప్రారంభించారు. ఐఐటీ జేఈఈ, జేఈఈ మెయిన్, మెడికల్ ఎంట్రెన్స్, నీట్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్టులకు ఇప్పటి వరకు 25 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్టు ఈ సంస్థ చెబుతోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jee main 2022, Jee mains 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు