ALLAHABAD HIGH COURT REJECTS PLEA BY 2 WOMEN OVER SAME GENDER MARRIAGE HERES WHY
OMG: తమ పెళ్లిని ఆమోదించాలని ఇద్దరు యువతుల పిటిషన్ .. ధర్మాసనం ఏం చెప్పిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Uttar pradesh: ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు.. సమాజం వీరి పెళ్లికి అంగీకరించలేదు. అందరిని కాదని.. పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
Allahabad High Court Rejects Plea By 2 Women Marriage: ప్రస్తుతం దేశంలో కొందరు విచిత్ర పోకడలకు పోతున్నారు. కొన్ని సంఘటనలలో నేటి యువత.. పాశ్చాత్య ధోరణులకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ స్వలింగ వివాహాన్ని ఆమోదించాలని కోరుతు ఇద్దరు యువతులు.. అలహబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందు వివాహ చట్టం ప్రకారం.. తమ పెళ్లిని ఆమోదించాలని కోరుతు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అలహబాద్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
అంజు దేవి అనే మహిళ.. తన 23 ఏళ్ల కూతురుని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతు హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. తన కూతురును 22 ఏళ్ల మరో యువతి నిర్భందించిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై .. విచారించిన ధర్మాసనం, ఏప్రిల్ 6న ఇద్దరు యువతులను కోర్టు ముందు హజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 7న ఇద్దరు యువతులు... కోర్టు ముందు హజరయ్యారు. తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ, హిందూ సంస్కృతిలో.. వివాహం 'సంస్కారం'లో.. స్త్రీ, పురుషుల మధ్య నిర్వహించవచ్చని తెలిపారు.
మన దేశం భారతీయ సంస్కృతి, మతాలు మరియు భారతీయ చట్టాల ప్రకారం నడుస్తుంది. భారతదేశంలో, వివాహాన్ని పవిత్రమైన 'సంస్కారం'గా పరిగణిస్తారు. భిన్న కులాలు, మతాల మధ్య వివాహలను అంగీకరిస్తారు. కానీ స్వలింగ సంపర్క వివాహలు ఆమోద యోగ్యం కాదని ధర్మాసనం తెలిపింది. భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదని.. జీవసంబంధమైన పురుషుడు , స్త్రీల మధ్య ఏర్పడే ఒక పవిత్ర బంధం అనే కారణంతో కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుతం ఈ వివాహాం ఆమోద యోగ్యం కాదని అలహబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.