Home /News /jobs /

ALL INDIA RADIO SPECIAL WEEKLY INTERACTIVE PROGRAM FOR COMPETITIVE EXAMS RECENTLY LAUNCHED ALL INDIA RADIO DETAILS HERE GH VB

All India Radio: పోటీ పరీక్షల కోసం స్పెషల్ వీక్లీ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ఆల్ ఇండియా రేడియో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం ఆల్ ఇండియా రేడియో(AIR) వినూత్న కార్యక్రమం చేపట్టింది. ‘వీక్లీ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్’ పేరుతో వారంలో ప్రతి శనివారం ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేయనుంది.

పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం ఆల్ ఇండియా రేడియో(AIR) వినూత్న కార్యక్రమం చేపట్టింది. ‘వీక్లీ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్’ పేరుతో వారంలో ప్రతి శనివారం ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను(Special Programme) ప్రసారం చేయనుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ టాఫిక్స్‌పై సెషన్స్(Sessions) నిర్వహిస్తూ, అభ్యర్థులను పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. 30 నిమిషాల పాటు జరిగే ఈ ప్రోగామ్‌ ఎపిసొడ్‌కు 'అభ్యాస్' అనే పేరు పెట్టారు. 100.1 FM గోల్డ్‌లో ప్రతి శనివారం రాత్రి 9:30 నుంచి 10:00 గంటల వరకు ప్రసారం కానుంది. మొదటి ఎపిసోడ్ ఏప్రిల్ 2న ప్రసారం అయింది. మొదటి ఎపిసోడ్‌లో ఆధునిక చరిత్రపై ప్రోగ్రామ్ నిర్వహించినట్లు AIR న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది.

* ప్రోగ్రామ్ వీక్షణం ఇలా
పోటీ పరీక్షల కోసం సన్నద్దం అవుతున్న వారు AIR ( ఆల్ ఇండియా రేడియో) వారాంతపు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌ను AIR Twitter హ్యాండిల్ '@airnewsalerts'లో వీక్షించవచ్చు. లేదా YouTube ఛానెల్ 'airnewsofficial' లోనూ చూడవచ్చు. అలాగే NewsonAir అనే యాప్‌లోనూ ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారిక ప్రకటన జారీ చేసింది. వీక్లీ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయినర్స్, ఫ్యాక్ట్‌ఫైల్, ఎగ్జామినేషన్ క్యాలెండర్, మ్యూజికల్ బ్రేక్‌తో వారాంతపు ప్రశ్న వంటివి ఉంటాయని తెలిపింది. అదేవిధంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రముఖ విద్యావేత్తతో సమాధానాలు చెప్పే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.

భారత రాజకీయాలు, రాజ్యాంగం అనే అంశంపై తదుపరి ఎపిసోడ్ ఏప్రిల్ 9న జరుగుతుంది. విద్యార్థులు తమ సందేహాలను వాట్సాప్ నంబర్ 928 909 4044కు పంపవచ్చు. లేదా ఏప్రిల్ 5 వరకు abhyaas.air@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ఈ వివరాలను ఆల్ ఇండియా రేడియో తెలిపింది.

JEE , NEET వంటి అగ్రశ్రేణి పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు రివైజ్ చేయడంలో క్రాష్ కోర్సులు ఎంతగానో సహాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొన్ని ఉచిత క్రాష్ కోర్సులను కల్పించగా, ప్రైవేట్ సంస్థలు కొంత ఫీజును వసూలు చేస్తున్నాయి.

Old Couple | Love Story: ‘లవ్ స్టోరీ’ అంటే ఇది..! ఈ జంట ఆరుపదుల వయస్సులో ఏం చేశారో చూడండి..


* NEET , JEE 2022 కోసం ప్రభుత్వ ఉచిత క్రాష్ కోర్సులు
నీట్, జేఈఈ పోటీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ‘అభ్యుదయ్’ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల మెరుగైన ప్రిపరేషన్ కోసం ప్రముఖ ప్రొఫెసర్ల సహాయంతో కోచింగ్ లెక్చర్లు, వీడియోలను అందిస్తోంది. ప్రతి విద్యార్థి అభ్యుదయ్ పథకం ద్వారా ఉచిత NTA 2022 ఆన్‌లైన్ కోచింగ్ అండ్ మాక్ టెస్ట్ సిరీస్‌ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

* JEE 2022 కోసం ప్రైవేట్ సంస్థల క్రాష్ కోర్సులు
దేశంలోని అనేక edtech కంపెనీలు NEET, JEE వంటి పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ క్రాష్ కోర్సులను నడుపుతున్నాయి. సమగ్ర క్రాష్ కోర్సు మాడ్యూల్‌లను అగ్రశ్రేణి IIT, NIT, JEE నిపుణులు రూపొందించారు. ఇప్పటికే సెషన్‌లు ప్రారంభమయ్యాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన టాప్-ర్యాంకింగ్ JEE నిపుణులు, ఫ్యాకల్టీల సహాయంతో క్రాష్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇందు కోసం విద్యార్థుల నుంచి రూ.3230 ఫీజును వసూలు చేయనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: All india radio, Aspirants, Career and Courses, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు