ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(Medical Science) గోరఖ్‌పూర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు AIIMS గోరఖ్‌పూర్ అధికారిక వెబ్సైట్ నుండి ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి ఆఫ్ లైన్ విధానంలో మీ యొక్క అప్లికేషన్స్ ను పంపించాలి. ఈ నోటిఫికేసన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులు గ్రూప్ ఏకి సంబంధించినవి. చివరి తేదీకి కంటే ముందు .. దరఖాస్తులో సూచించిన ఫార్మాట్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అవసరమైన అన్ని పత్రాలతో పాటు ఫారమ్‌ను సరిగ్గా పూరించి.. స్పీడ్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాల కోసం aiimsgorakhpur.edu.inను సందర్శించొచ్చు.
AIIMS గోరఖ్‌పూర్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19 డిసెంబర్ 2022 . మీ దరఖాస్తులు ఈ తేదీన సాయంత్రం 5 గంటలలోపు AIIMS గోరఖ్‌పూర్‌కు చేరుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా.. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా.. దరఖాస్తులను గడువు కంటే ముందే పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
విభాగాల వారీగా ఖాళీలు ఇలా..
మొత్తం పోస్టులు – 92
ప్రొఫెసర్ - 28 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్ - 21 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ - 18 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 25 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస విద్యార్హత పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. వివిధ పోస్టుల కోసం దరఖాస్తు గురించి సమాచారాన్ని పొందడానికి అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నోటీసును చూడటం మంచిది. వయోపరిమితి విషయానికొస్తే.. గరిష్టంగా 58 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ప్రొఫెసర్ మరియు అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు.. 50 ఏళ్లలోపు అభ్యర్థులు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా..
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. దాన్ని సరిగ్గా పూరించి.. హార్డ్ కాపీని ఈ చిరునామాకు పంపండి. ‘‘రిక్రూట్మెంట్ సెల్ (అకడమిక్ బ్లాక్) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పూర్ కున్ఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్-273008’’.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Central Government Jobs, Govt Jobs 2022, JOBS