ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్‌పూర్ ఫ్యాకల్టీ(Faculty) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10, 2023 నుంచి ప్రారంభం కానుండగా.. 27 జనవరి 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి AIIMS రాయ్‌పూర్ అధికారిక సైట్‌ని aiimsraipur.edu.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 39 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీ పోస్టులు ఇలా..
1. అనస్థీషియాలజీ: 2 పోస్ట్‌లు
2. బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ: 3 పోస్టులు
3. కార్డియాలజీ: 1 పోస్ట్
4. క్లినికల్ హెమటాలజీ: 3 పోస్ట్‌లు
5. ఎండోక్రినాలజీ & మెటబాలిజం: 2 పోస్ట్‌లు
6. గ్యాస్ట్రోఎంటరాలజీ: 2 పోస్టులు
7. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 2 పోస్టులు
8. మెడికల్ ఆంకాలజీ: 2 పోస్టులు
9. నెఫ్రాలజీ: 1 పోస్ట్
10. న్యూరాలజీ: 2 పోస్టులు
11. న్యూక్లియర్ మెడిసిన్: 3 పోస్టులు
12. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ: 6 పోస్టులు
13. సర్జికల్ ఆంకాలజీ: 6 పోస్టులు
14. ట్రామా & ఎమర్జెన్సీ (జనరల్ మెడిసిన్/ఎమర్జెన్సీ మెడిసిన్): 1 పోస్ట్
15. ట్రామా & ఎమర్జెన్సీ (జనరల్ సర్జరీ): 1 పోస్ట్
16. ట్రామా & ఎమర్జెన్సీ (న్యూరోసర్జరీ): 2 పోస్ట్‌లు
అర్హతలు..
సంబంధిత రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. పని అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్‌ని సందర్శించి, దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీనిలో అర్హత వివరాలు, వ్యక్తిగత వివరాలను నింపాలి. వీటితో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేయాలి. తర్వాత వీటిని రిక్రూట్‌మెంట్ సెల్ 2వ అంతస్తు, మెడికల్ కాలేజీ బిల్డింగ్ గేట్ నం.5, AIIMS రాయ్‌పూర్, G.E. రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్- 492099 అడ్రస్ కు ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.