ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (All India Council for Technical Education) వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ -2022ను ప్రారంభించనుంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (Bachelor of Engineering), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) చదువుతున్న ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు (Students) దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు internship.aicte-india.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (Virtual Internship Program) కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30గా నిర్ణయించింది. ప్రధానంగా నెట్‌వర్కింగ్ (Networking), ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ (Cyber Security)వంటి అంశాల్లో ఇంటర్న్‌షిప్ కోసం దాదాపు లక్ష మంది అభ్యర్థులను ఏఐసీటీఈ ఎంపిక చేయనుంది.
Cisco, NASSCOM సహకారంతో ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ (AICTE) చేపట్టనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు పరిశ్రమ అనుభవాన్ని పొందేందుకు ఇది మంచి అవకాశమని ఏఐసీటీఈ పేర్కొంది. రెండు నెలల పాటు జరిగే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు తమ నెట్‌వర్క్‌ను మరింత పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థుల (Candidates) నైపుణ్యాలు మెరుగుపడతాయని ఏఐసీటీఈ తెలిపింది.
సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీతో భాగస్వామ్యం..
నైపుణ్యాన్ని జాతీయ ప్రాధాన్యతగా సెట్ చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో దేశాన్ని డిజిటల్ టాలెంట్ హబ్‌గా మార్చడం కోసం సిస్కో, NASSCOM సహకారంతో ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తదుపరి దశను ప్రారంభించామని ఏఐసీటీఈ అధికారిక నోటీస్ లో పేర్కొంది. ప్రధానంగా నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీలో వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లను (Virtual Internship Program) అందించడానికి సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని. తద్వారా పరిశ్రమ - ప్రభుత్వం మధ్య వారధిలా పనిచేస్తూ పరిశ్రమలో టెక్ ఉద్యోగాల కోసం నైపుణ్యం ఉన్న టాలెంట్ పూల్‌ను రూపొందించడానికి కృషి చేస్తామని ఏఐసీటీఈ పేర్కొంది.
మూడు గంటల ఇండస్ట్రీ సెషన్..
AICTE వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు విజయంతంగా కోర్సు పూర్తి చేసిన తరువాత సర్టిఫికేట్ అందుకోనున్నారు. అయితే ఇది వారి పని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు ముందుగా ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ కోర్స్, ఇంట్రడక్షన్ టు ప్యాకెట్ ట్రేసర్‌పై కోర్సులను పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించిన తరువాత మూడు గంటల ఇండస్ట్రీ సెషన్ (Industry Session)లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సిస్కో హోస్ట్ చేయనుంది.
ఇండస్ట్రీ సెషన్ (Industry Session)లో పాల్గొన్న తర్వాత విద్యార్థులకు సంస్థలు ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్‌ని కేటాయిస్తాయి. ప్యాకెట్ ట్రేసర్ సిమ్యులేషన్ టూల్‌పై సంస్థల కోసం సురక్షిత నెట్‌వర్క్‌ను రూపొందించడానికి విద్యార్థులు గైడ్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా సమర్పించిన తర్వాత విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొననున్నారు.
ఇది ఇలా ఉంటే.. ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ న్యూట్రిఫైటుడే అకాడమీ న్యూట్రాస్యూటికల్స్ ఉత్పత్తులకు సంబంధించిన బ్రిడ్జింగ్ కోర్సులపై ఇటీవల పలు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. న్యూట్రాస్యూటికల్స్ రంగంలో సరికొత్త వర్క్ మెథడ్‌లో ఉద్యోగులను అప్‌గ్రేడ్ చేయాలనుకునే కంపెనీలకు, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ ప్రోగ్రామ్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు సంస్థ అధికారిక వెబ్‌సైట్ academy.nutrifytoday.com ద్వారా అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicte, Engineering course, Internship, New course, Online course, Students