Free Courses: కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా? ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ

AICTE 49 free courses | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న 49 ఆన్‌లైన్ కోర్సుల వివరాలు ఇవే.

news18-telugu
Updated: May 8, 2020, 11:00 AM IST
Free Courses: కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా? ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ
Free Courses: కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా? ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఖాళీ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల్ని అందిస్తోంది. విద్యార్థుల కోసం 49 ఇ-లెర్నింగ్ కోర్సుల్ని ప్రకటించింది. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, కార్పొరేట్ సెక్టార్‌లో కెరీర్ కోసం ప్రయత్నించేవారికి ఈ కోర్సులు ఎంతో మేలు చేస్తాయి. 2020 మే 15 వరకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ జాబ్స్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ప్రిపరేషన్‌కు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవాలనుకునే వారికీ 50 గంటల ఛాట్ బేస్డ్ ఇంటరాక్టీవ్ ఆడియో విజువల్ కంటెంట్ అందుబాటులో ఉంది. గేట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేవారికి 100 గంటల వీడియో లెస్సన్స్ ఉన్నాయి.

ఈ కోర్సులన్నీ ఉచితం. ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి. ముందుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE అధికారిక వెబ్‌సైట్ http://free.aicte-india.org/ ఓపెన్ చేయండి. అందులో కోర్సుల జాబితా ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సు పైన క్లిక్ చేయండి. కోర్సు వివరాలన్నీ ఓసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత Learn for Free during Covid shut down పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Enroll Now పైన క్లిక్ చేయండి. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత కోర్సు ప్రారంభించొచ్చు. మరి AICTE ఉచితంగా ఆన్‌లైన్‌లో అందిస్తున్న 49 కోర్సుల జాబితా ఇదే.

1. ProTeen
2. Diploma in Machine Learning with R studio
3. Machine Learning using Python
4. Data Analytics using R
5. IAAA: Certified Software Testing Professional - Functional Testing6. IAAA: Certified Agile Scrum Associate
7. LEAP: Learning Excellence & Progression
8. Big Data 101
9. R Programming
10. Java Programming
11. Data Science for Beginners/Python for Data Science
12. Programming Work Bench
13. Digital Marketing
14. MATLAB Onramp
15. Machine Learning Onramp
16. Deep Learning Onramp
17. AI/ML Internship
18. Ekeeda
19. EnggOnline
20. Integrated Educational & Learning Program
21. Certified Full Stack Engineer
22. Mechanical Engineering Essentials Program
23. Performance Management & Competency Mapping
24. Financial Management
25. Online Internship in Financial Analysis Basics
26. Online Internship in Investment Analysis Skills
27. Great Learning Academy
28. MTC E- learning management system
29. Edulib
30. TickTalkTo
31. Study Skills Package
32. Courses for Communication Skills and Interview Preparation
33. Virtual Robotics Toolkit (VRT)
34. CAD using Autodesk Inventor
35. Xcelerator
36. Statistics 101
37. Quanser's Experience Controls App
38. Structural and Foundation Analysis
39. Non-Scholastic Aptitude Test
40. PracCamp
41. GATE Exam Preparation
42. Introduction to Banking
43. Introduction to UPSC (NCERT Product)
44. NI Online Training Resources
45. NI Badge Program
46. On-line Engineering Teaching Resources
47. Ultra-concurrent Remote laboratory
48. Emona Remote Lab Experiments in Electronics & Telecommunications
49. GUVI

ఈ 49 ఫ్రీ కోర్సులకు సంబంధించిన లింక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ... ఖాళీ సమయంలో పూర్తి చేయండి

Free Course: సాఫ్ట్‌వేర్ జాబ్ మీ కలా? ఈ ఫ్రీ కోర్సు చేయండి

Free Course: ఐటీ ఉద్యోగం మీ కలా? టీసీఎస్ నుంచి ఫ్రీ కోర్సు చేయండిలా
Published by: Santhosh Kumar S
First published: May 8, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading