MCA course: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసీఏ ఇక రెండేళ్లే

ఎంసీఏ చదవాలనుకుంటున్నారా? ఇకపై మూడేళ్లు ఎంసీఏ చదవాల్సిన అవసరం లేదు. రెండేళ్లలో కోర్సు పూర్తి చేయొచ్చు.

news18-telugu
Updated: July 8, 2020, 4:20 PM IST
MCA course: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసీఏ ఇక రెండేళ్లే
MCA course: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసీఏ ఇక రెండేళ్లే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్-MCA చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఎంసీఏ ఇకపై మూడేళ్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్సు రెండేళ్లలో పూర్తి చేయొచ్చు. వాస్తవానికి 2019 డిసెంబర్‌లో జరిగిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC 545వ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అమలులోకి వచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఎంసీఏ కోర్సు వ్యవధి రెండేళ్లేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE అధికారికంగా ప్రకటించింది.

బీసీఏ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బీఎస్‌సీ, బీకామ్, బీఏ కోర్సులు పాసైనవారు ఎంసీఏ కోర్సుకు అప్లై చేయొచ్చు. 10+2 లెవెల్ లేదా గ్రాడ్యుయేషన్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తప్పనిసరి. క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో కనీసం 55% మార్కులతో పాస్ కావాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు 45% మార్కులతో పాసైతే చాలు.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading