ALL ABOUT TSPSC GROUP EXAMS KNWO STRATEGY AND PREPARATION PLANS OF ALL GROUP EXAMS GH VB
TSPSC Group Exams: టీఎస్పీఎస్సీ గ్రూప్స్(Groups) కొలువు మీ లక్ష్యమా..? ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి..
(image: TSPSC)
తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు.
తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మొత్తం పోస్టుల్లో 11,626 గ్రూప్ - I, II, III, IV సర్వీసుల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ I – 503, గ్రూప్ II – 582, గ్రూప్ III – 1373, గ్రూప్ IV – 9168 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. రెగ్యులర్, డిస్టన్స్ విధానంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్(Notification)లో పేర్కొన్న వయో పరిమితికి లోబడి ఉండాలి. భారీ స్థాయిలో పోస్టులు ఉన్నందున పోటీ కూడా అంతే స్థాయిలో ఉండనుంది. కాబట్టి, ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితేనే విజయం వరిస్తుంది. ప్రిపరేషన్(Preparation) ప్రారంభించే ముందు పరీక్షా విధానం, సిలబస్‌పై(Syllabus) పట్టు సాధించాలి. సిలబస్‌కు అనుగుణంగా బుక్స్ సమీకరించుకొని సన్నద్దమవ్వాలి.
గ్రూప్ 1 మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేరుతో ఒకే పేపర్‌తో కూడిన ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష.
మెయిన్స్ ఎగ్జామినేషన్ - ఒక్కో పేపర్‌కు 150 మార్కుల వెయిటేజీతో ఆరు పేపర్లతో కూడిన డిస్క్రిప్టివ్ పరీక్ష.
పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కుల వెయిటేజీ గల పర్సనల్ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కు హాజరు కావడానికి అర్హులు. మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్స్, పర్సనల్ ఇంటర్వూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గ్రూప్ II పరీక్షా విధానం
గ్రూప్ 2 పరీక్ష మొత్తం రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఈ నాలుగు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
పేపర్ I - జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ II - చరిత్ర, రాజకీయాలు, సమాజం
పేపర్ III ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్
పేపర్ IV - తెలంగాణ ఉద్యమం మరియు నిర్మాణం
పర్సనాలిటీ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూకు 60 మార్కుల వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
గ్రూప్ III పరీక్షా విధానం
గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. ఈ మూడు పేపర్లను కలిపి ఒకే ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ II చరిత్ర (తెలంగాణ ఏర్పాటుతో సహా), రాజకీయాలు- సమాజం
గ్రూప్ 4లో రెండు పేపర్లుంటాయి. ఈ రెండు పేపర్లకు 150 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఈ రెండు పేపర్లను కలిపి ఒకే ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్ I - జనరల్ నాలెడ్జ్
పేపర్ II - సెక్రటేరియల్ ఎబిలిటీస్
గ్రూప్ I, గ్రూప్ II ప్రిలిమ్స్, గ్రూప్ III, గ్రూప్ IV సర్వీసెస్‌లో పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్ అన్నింటికీ కామన్‌గా ఉంటుంది. అయితే సర్వీస్ స్థాయిని బట్టి సబ్జెక్ట్ వెయిటేజీ మారుతుంది. ఉదాహరణకి - తెలంగాణ ఏర్పాటుకు గ్రూప్ I, గ్రూప్ IIలో 150 మార్కులు కేటాయించారు. అయితే, గ్రూప్ IIIలో దీనికి 50 మార్కుల వెయిటేజీ మాత్రమే ఉంటుంది. గ్రూప్ IV పేపర్ Iలో జనరల్ స్టడీస్‌కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది
7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్యావరణ శాస్త్రాలపై ICSE పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి. విపత్తు నిర్వహణ కోసం 8, 9, 10వ తరగతి NCERT పాఠ్యపుస్తకాలను చదవాలి.
జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, తెలంగాణ
ఇండియన్ జాగ్రఫీ కోసం బ్లాక్స్వాన్ అట్లాస్ వంటి ప్రామాణిక అట్లాస్, 7 నుండి 10 తరగతుల వరకు NCERT పాఠ్యపుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. SSC సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు (6 నుండి 10వ తరగతి వరకు), 2021–22 ఆర్థిక సర్వే నివేదికపై పట్టు సాధించాలి. ఇది తెలంగాణ భౌగోళిక శాస్త్రం, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. NCERT 9వ తరగతి నుండి 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమికాంశాలను చదవవచ్చు.
ఇండియన్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ రచించిన ఇండియన్ పాలిటీ బుక్‌ను చదవండి. దీనితో పాటు ఏదైనా ప్రామాణిక భారతీయ రాజకీయ పాఠ్యపుస్తకాన్ని కూడా చదవండి.
ఇండియన్ హిస్టరీ
పురాతన, మధ్యయుగ, ఆధునిక భారతీయ చరిత్రల కోసం NCERT పుస్తకాలను చదవాలి.
తెలంగాణ హిస్టరీ, మూవ్మెంట్
తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల ద్వారా తెలంగాణ హిస్టరీ, మూవ్మెంట్ ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ I, గ్రూప్ II లకు వి ప్రకాష్ రాసిన ఫార్మేషన్ ఆఫ్తెలంగాణ బుక్ బాగా ఉపయోగపడుతుంది.
తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్
ఈ అంశాలు తెలంగాణ చరిత్రలో ఒక భాగం. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలతో ప్రిపేర్ అవ్వాలి.
తెలంగాణ రాష్ట్ర విధానాలు
తెలంగాణ ప్రభుత్వం 2 జూన్ 2014 నుండి ప్రారంభించిన అన్ని పాలసీలను తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. ఈ పాలసీలు తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వేలో వివరంగా ఉంటాయి
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.