గేట్ 2022 (GATE 2022) కు అప్లై చేశారా? అయితే మీకో అలర్ట్. అప్లై చేసే సమయంలో మీ వివరాలను పొరపాటునే ఏమైనా తప్పుగా నమోదు చేసి ఉంటే.. వాటిని కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించింది ఐఐటీ ఖరగ్పూర్(IIT Kharagpur). ఇందుకోసం కరెక్షన్ విండోను (GATE 2022 Correction Window) ఓపెన్ చేసింది. ఈ కరెక్షన్ విండోను ఈ నెల 1న ఓపెన్ చేశారు అధికారులు. ఈ అవకాశం ఈ రోజు అర్థరాత్రితో ముగియనుంది. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లు (GATE 2022 Exam Centers, పేపర్లను(GATE 2022 Exam Papers) సైతం మార్చుకోవచ్చు. వీటితో పాటు జెండర్ (Gender), కేటగిరీ(Category), పేరెంట్స్ వివరాలు(Parents Details), కాలేజీ పేరు(College Name), ఎగ్జామ్ పేపర్(Exam Paper) తదితర వివరాలను కరెక్షన్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ వివరాలను మార్చుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://gate.iitkgp.ac.in/) ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం లాగిన్ (Login) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3: ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
Step 4: అనంతరం మీకు కరెక్షన్ విండో స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 5: మీకు కావాల్సిన వివరాలను ఎడిట్ చేసుకోవాలి/మార్చుకోవాలి.
Step 6: అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
-భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.
ఈ సారి మార్పులివే..
గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ఈ సారి కొత్తగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ అనే రెండు పేపర్లను చేర్చారు. ఈ రెండు పేపర్లతో గేట్ సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. అభ్యర్థులు వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరయ్యే విధానాన్ని గేట్–2021 నుంచి అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది గేట్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్పూర్ (IIT Kharagpur) నిర్వహిస్తోంది. గేట్ ఎగ్జామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో ఎంఈ/ఎంటెక్ అడ్మిషన్లు పొందవచ్చు. అంతేకాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acting career, Career and Courses, Exams, IIT