హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Examination: ఈ ఏడాది నుంచే సెమిస్టర్​ పద్ధతిలో సీబీఎస్​ఈ ఎగ్జామ్స్.. కొత్త ప్యాటర్న్​పై పూర్తి వివరాలివే!

CBSE Examination: ఈ ఏడాది నుంచే సెమిస్టర్​ పద్ధతిలో సీబీఎస్​ఈ ఎగ్జామ్స్.. కొత్త ప్యాటర్న్​పై పూర్తి వివరాలివే!

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

కరోనా కాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి విద్యార్థుల కోసం సరికొత్త ఎగ్జామినేషన్ ప్యాట్రన్ తీసుకొచ్చిన సంగతి విధితమే. ఈ సరికొత్త సీబీఎస్ఈ పరీక్షా విధానం 2021-22వ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.

ఇంకా చదవండి ...

కరోనా కాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి విద్యార్థుల కోసం సరికొత్త ఎగ్జామినేషన్ ప్యాట్రన్ తీసుకొచ్చిన సంగతి విధితమే. ఈ సరికొత్త సీబీఎస్ఈ పరీక్షా విధానం(CBSE Exam Pattern) 2021-22వ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. నూతన పరీక్ష సరళి ప్రకారం సిలబస్ (CBSE Syllabus) ని రెండు భాగాలుగా విభజించి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు(Exams) నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలు(Exams) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ(CBSE) ముఖ్యమైన ప్రకటన చేసింది. టర్మ్-1 ఎగ్జామినేషన్ నవంబర్-డిసెంబర్, 2021 మధ్య కాలంలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష అని.. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుందని వివరించింది. టర్మ్-2 ఎగ్జామినేషన్ మార్చి-ఏప్రిల్, 2022 సమయంలో నిర్వహిస్తామని.. ఇది ఒక సబ్జెక్టివ్/ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అని.. పరీక్ష సమయం 120 నిమిషాలు అని తెలిపింది.

మొత్తం 189 సబ్జెక్టుల్లో పరీక్షలు..

10వ తరగతి విద్యార్థులకు టర్మ్-1 ఎగ్జామినేషన్ 2021 నవంబర్​ 17నుంచి ప్రారంభమవుతుంది. 12వ తరగతి విద్యార్థులకు 2021 నవంబర్​ 16తేదీ నుంచి ఆరంభమవుతుందని వెల్లడించింది. అడ్మిట్ కార్డ్స్ నవంబర్ 9న విద్యార్థులకు అందిస్తామని బోర్డు ప్రకటించింది. ఇప్పటినుంచి సరిగ్గా పది రోజుల సమయంలో పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆలస్య చేయకుండా చదవడం ప్రారంభించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ ఇప్పుడు 12వ తరగతి విద్యార్థులకు 114 సబ్జెక్టులను.. 10వ తరగతి విద్యార్థులకు 75 సబ్జెక్టులను ఆఫర్ చేస్తోంది. దీని అర్థం సీబీఎస్ఈ మొత్తంగా 189 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.

TS EAMCET 2021 Counselling: నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..

అయితే ఈ ఎగ్జామ్స్ అన్నీ నిర్వహించడానికి 45 నుంచి 50 రోజుల సమయం పడుతుందని బోర్డు తెలిపింది. దీనివల్ల విద్యార్థులు విద్యనభ్యసించే సమయాన్ని కోల్పోతారు. అందుకే సీబీఎస్ఈ ఆయా సబ్జెక్టులను నిర్దిష్ట తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా నిర్ణయించింది. ఇందుకుగాను అన్ని అనుబంధ స్కూళ్లకు పరీక్ష తేదీలకు సంబంధించి డేటా షీట్ ఫిక్స్ చేస్తామని తెలిపింది. కాగా, 12వ తరగతి విద్యార్థులకు ఆఫర్ చేస్తున్న 114 సబ్జెక్టులలో కేవలం 19 సబ్జెక్టులు మాత్రమే మేజర్ సబ్జెక్టులు మిగతావన్నీ మైనర్ సబ్జెక్టులు. టెన్త్ క్లాస్ స్టూడెంట్ లకు ఆఫర్ చేస్తున్న 75లో 9 మాత్రమే మేజర్ సబ్జెక్టులు. సెమిస్టర్​ 1లో ఎక్స్​టర్నల్​ ఎగ్జామినర్​ని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. సీబీఎస్ఈ స్కూల్స్ తమ టీచర్లతో ప్రాక్టికల్ అసెస్‌మెంట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

TS EAMCET 2021 Counselling: నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..

భారత దేశ వ్యాప్తంగా మొత్తం 26 వేల స్కూళ్లు బోర్డుతో అనుబంధమై ఉన్నాయి. 26 దేశాల్లో కూడా సీబీఎస్ఈ బోర్డు అనుబంధ పాఠశాలలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్ ఫిక్స్ చేసే అంశంపై బోర్డు దృష్టి సారిస్తోంది. ఈ పరీక్ష అనేది అన్ని పాఠశాలలలో కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి స్కూలు భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఒక పరిశీలకుడిని ఎగ్జామ్ సెంటర్ వద్ద నేను ఉంచాల్సి ఉంటుంది. 500 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో ఒక పరిశీలకుడు ఐదు వందలకు మించి ఉంటే 2 పరిశీలకులను నియమించాల్సి ఉంటుంది.

నవంబర్​ 9న అడ్మిట్​ కార్డులు..

బీఎస్ఈ బోర్డు కస్టమైజ్డ్ ఓఎంఆర్ షీట్లను ఆన్ లైన్ లో ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కి పంపిస్తుంది. పాఠశాలలు ఈ షీట్ డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. బోర్డు మెయిన్ ఎగ్జామినేషన్ ముందుగా ఒక స్పెసిమెన్/నమూనా కూడా పాఠశాలలకు పంపిణీ చేస్తుంది. తద్వారా విద్యార్థులు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ చేయడంపై పట్టు సాధించొచ్చు. టర్మ్ 1 ఎగ్జామినేషన్ లో రఫ్ వర్క్(rough work) కోసం విద్యార్థులకు సపరేట్ షీట్ కూడా అందిస్తారు.

ప్రస్తుతం శీతాకాలం లో ఎగ్జామినేషన్ ఉదయం 11:30 నిర్వహించాలని సీబీఎస్ఈ తెలిపింది. ఏవైనా మార్పులు ఉంటే ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో పేర్కొంటామని తెలిపింది. ఆ ఎగ్జామినేషన్ నిర్వహణ, మూల్యాంకనం గురించి ఒక్కో వెబినార్ నిర్వహించనుంది సీబీఎస్ఈ. పాఠశాలలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీబీఎస్ఈ ప్రకారం కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021

ఉత్తమ కథలు