పదో తరగతి టర్మ్1 పరీక్షల ప్యాటర్న్‌లో మార్పులు చేసి పరీక్షలు నిర్వహించింది CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్). అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు (Students) వందకు వంద శాతం మార్కులు సాధించారు. 100 శాతం మార్కులు సాధించిన కొంత మంది విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రిపరేషన్ కోసం అనుసరించిన ప్రణాళికలు, రివిజన్ తదితర విషయాలపై మాట్లాడారు.
ప్రియాన్షి అగర్వాల్:
గురుగ్రామ్‌కు చెందిన ఈ విద్యార్థిని సెక్టార్ 46లోని అమిటీ ఇంటర్నేషన్ లో స్కూల్‌లో చదువుతుంది. 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన అనుభవాలను తన మాటలలోనే.. ‘‘టర్మ్1 పరీక్షల ప్యాటర్న్ మార్పుతో మొదట్లో కొంత ఆందోళనకు గురయ్యా. అయితే సీబీఎస్‌ఈ బోర్డు అందించిన శాంపిల్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేశాను. ఇందుకు స్కూల్ యాజమాన్యం అందించిన సహకారం మరువలేనిది. కొత్త ప్యాటర్న్‌కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావడంతో పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాలేదు’’. అని ప్రియాన్షి తెలిపింది.
CBSE Term 2 Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్.. డేట్ షీట్ విడుదల.. వివరాలివే
‘‘సీబీఎస్‌ఈ ఉన్నట్టుండి పరీక్ష ప్యాటర్న్‌ను మార్చి కొత్త విధానాన్ని ప్రకటించింది. దీంతో పరీక్షల సరళి ఒక్కసారిగా మారిపోయింది. పాత ప్యాటర్న్ ప్రకారం.. పెద్ద, చిన్న తరహా ప్రశ్నలు ఉండేవి. తాజాగా దాని స్థానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) ఉన్నాయి. పరీక్షల్లో గొప్పగా రాణించడానికి బోర్డు అందించిన నమూనా ప్రశ్నాపత్రాలను వేటిని వదలకుండా సమగ్రంగా అధ్యయనం చేశాం. ఇందులో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఇదే విధానాన్ని టర్మ్ 2 పరీక్షల కోసం అనుసరిస్తాం’’ అని ప్రియాన్షి చెపుకొచ్చింది.
ప్రియాన్షి అగర్వాల్ తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్‌గా, తల్లి డాక్టర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం 15 ఏళ్ల ప్రియాన్షి కూడా CA కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే IIM (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) నుంచి MBA పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే ప్రస్తుతం తన ప్రధాన దృష్టి 10వ తరగతి టర్మ్ 2 పరీక్షలపైనే అని ప్రియాన్షి వివరించింది.
ఆయూషి జైన్
ఈ విద్యార్థి కూడా 10వ తరగతి టర్మ్ 1 పరీక్షల్లో వంద శాతం మార్కులు సాధించింది. గురుగ్రామ్ సెక్టార్ 43లోని అమిటీ ఇంటర్‌నేషన్ స్కూల్ లోనే అయుషి కూడా చదువుతోంది. ‘‘ కొత్త ప్యాటర్న్ ఎక్సైటింగ్‌గా అనిపించింది. పరీక్షల కోసం అప్పటి వరకు మేం సబ్జెక్టివ్ టైప్‌లో ప్రిపేర్ అయ్యాము. అయితే మార్చిన ప్యాటర్న్ ప్రకారం MCQ పద్దతిలో సన్నద్ధం కావడం సవాల్‌గా తీసుకున్నాం. ’’ అని ఆయుషి వివరించింది.
‘‘సబ్జెక్టివ్ పేపర్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పూర్తి వివరాలపై శ్రద్ధ పెట్టాం. రిజల్ట్స్ రోజు ఉదయాన్నే మా టీచర్ నా ఫలితాల గురించిన వార్తను ఫోన్ చేసి చెప్పింది. MCQ పద్దతిలో పరీక్షలకు హాజరు కావడం నాకు ఇదే మొదటిసారి కావడంతో ఫలితం ఎలా ఉన్నా మానసికంగా సిద్ధమయ్యాను. వంద శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించావని టీచర్ చెప్పింది. అయితే మొదట్లో అది నేను నమ్మలేదు. కానీ, నేను రిజల్ట్స్ చూసుకున్నాక చాలా సంతోషంగా అనిపించింది.’’ అని 14 ఏళ్ల ఆయుషి జైన్ పేర్కొంది.
సాచిక యాదవ్
ఆయుషి క్లాస్‌మేట్ సాచికా యాదవ్. ఈమె కూడా టాప్ మార్కులతో పాసైంది. టీచర్ల సలహాలతో పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అయ్యారు.‘‘ టర్మ్ 1 పరీక్షలకు ముందు మా ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. దీంతో పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు కూడా ఎలాంటి సహకారం అందించలేదు. అయితే నేను టాప్ మార్కులతో పాసైన విషయం తెలిసినప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో సంతోష పడ్డారు.’’ అని వివరించింది సాచికా.
కాగా, ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఏ విద్యార్థి ఫెయిల్ కాలేదు. టర్మ్2 పరీక్షల ఫలితాల తరువాతే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. అయితే ఈలోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు, స్కూల్ యాజమాన్యాలు మార్చి 26లోపు తెలియజేయాలని సూచించింది. ఇందు కోసం విండోను ప్రవేశపెట్టింది. అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు స్కూల్‌లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం యాజమాన్యాలు బోర్డుతో సంప్రదింపులు జరపవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.