Alert to AP SSC passed students - ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పదో తరగతి పరీక్ష ఫలితాలు (AP SSC Results 2022) ఇటీవలే విడుదల అయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 6.22 లక్షల మంది రాసిన పరీక్షల్లో కేవలం 67.27 శాతం ఉత్తీర్ణతే నమోదైంది. తాజాగా ప్రభుత్వం ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి దశ అడ్మిషన్లు ఈనెల 27 నుంచి ప్రారంభిస్తారు. వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. గడువు తేదీ కూడా అదే. జూలై 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్, రెసిడెన్షియల్, బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కళాశాలలు, ఒకేషనల్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఇంటర్ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీ్‌సమెన్, ఈబీసీలకు వారి కోటా రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. బాలికలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పదో తరగతి మార్కులు, గ్రేడ్‌ల ఆధారంగానే ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో సెక్షన్‌కు 88కి మించి అడ్మిషన్లు చేసుకోకూడదు. ఒకేషనల్‌లో అయితే ఒక్కో సెక్షన్‌కు 30, నాన్ పారామెడికల్ కోర్సుల్లో ఒక్కో సెక్షన్‌లో 40మందిని మాత్రమే చేర్చుకోవాలని నిబంధనలు రూపొందించారు.
గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలు విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఆ తర్వాత ఇప్పుడే ఇంత తక్కువ ఉత్తీర్ణత రావడం విద్యార్థుల్లో కాస్త ఆందోళన కలిగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP inter board, AP intermediate board exams, JOBS