ప్రభుత్వ సంస్థల్లో కొలువు సాధించడం చాలా మంది కల. ఇందుకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పాయి కొన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ బోర్డులు(Recruitment Boards). ఇప్పుడు వివిధ సంస్థలు కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. వీటిలో ఈ వారం అప్లై (Apply) చేయడానికి సిద్ధంగా ఉన్నవి ఏవో చూద్దాం.
డబ్ల్యూబీపీఎస్సీ(WBPSC)
వెస్ట్ బెంగాల్ సబార్డినేట్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్‌లో పలు పోస్టుల భర్తీకి వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీర్స్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.9,000 నుంచి రూ.40,500 పే స్కేల్ ప్రకారం జీతం లభించనుంది.
యూపీపీసీఎల్
ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPPCL) అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తంగా 209 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 92 అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 51 ఓబీసీ కేటగిరీ, 20 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 41 ఎస్సీ కేటగిరీ, 5 పోస్టులు ఎస్టీ కేటగిరీకి చెందినవి. షార్ట్‌లిస్టింగ్ పరీక్ష జనవరి 2023 రెండవ వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
సీఎస్బీఎస్
బీహార్‌కు చెందిన సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్స్(CSBC) రిక్రూట్మెంట్ బోర్డు.. ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 689 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలి.
CURAJ
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (CURAJ) 47 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టుల్లో 15 ప్రొఫెసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేస్కేల్ రూ.1,44,200 నుంచి రూ. 2,18,200 మధ్య ఉంటుంది. 12 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల పే స్కేల్ రూ. 1,31,400 నుంచి రూ.2,17,100. అసిస్టెంట్ ప్రొఫెసర్ 18 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,82,400 జీతం లభిస్తుంది.
ఐటీబీపీ
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) 293 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 167 కానిస్టేబుళ్లు, 126 హెడ్ కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500 నుంచి రూ.81,100 పే స్కేల్ వర్తించనుంది. ఇక, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పే స్కేల్ రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉండనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS