హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Classes 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఆన్‌లైన్ క్లాసులు వాయిదా

TS Inter Classes 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఆన్‌లైన్ క్లాసులు వాయిదా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Classes 2021 | తెలంగాణలోని ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. ఎందుకో తెలుసుకోండి.

  తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌కి జూన్ 1న ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ క్లాసుల్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను 2021 మే 25 నుంచి జూలై 5 వరకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు... విద్యార్థులకు జూన్ 1 నుంచే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయని కూడా ప్రకటించింది. ప్రతీ ఏడాది విద్యా సంవత్సరం జూన్ 1న మొదలవుతుంది కాబట్టి క్లాసులు కూడా అదే రోజున మొదలవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో, రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించడంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. అందుకే ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. క్లాసులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయం తర్వాత ప్రకటిస్తుంది.

  NISER Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ఇక తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూలై 5 వరకు కొనసాగనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల దగ్గర దరఖాస్తుల్ని స్వీకరించట్లేదు ఇంటర్ బోర్డు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆప్షన్ ఫామ్ కల్పించింది ఇంటర్ బోర్డు. తెలంగాణలోని ఏ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా ఇదే పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ 2021 జూన్ 1న అందుబాటులోకి వస్తుంది.

  తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. విద్యార్థులు ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆన్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Get Details పైన క్లిక్ చేయాలి. పైన చెప్పిన విధంగా మాత్రమే విద్యార్థులు దరఖాస్తు చేయాలి. అడ్మిషన్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

  UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

  NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ఇంటర్ అడ్మిషన్ల విషయంలో పదో తరగతి లో వచ్చిన గ్రేడ్స్‌ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కళాశాలలకు స్పష్టం చేసింది బోర్డు. అడ్మిషన్ల కోసం ఎలాంటి ఎంట్రెన్స్ టెస్ట్‌లో నిర్వహించకూడదని హెచ్చరించింది. ఇక కళాశాలల్లో అనుమతికి మించి విద్యార్థులను చేర్చుకోవద్దని కూడా సూచించింది ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Intermediate, Online classes, Online Education, Telangana, Telangana inter board, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు