JEE Main 2021: విద్యార్థులకు అలర్ట్... జేఈఈ మెయిన్ 2021 పరీక్షలపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

JEE Main 2021: విద్యార్థులకు అలర్ట్... జేఈఈ మెయిన్ 2021 పరీక్షలపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

JEE Main 2021 | జేఈఈ మెయిన్ 2021 విద్యార్థులకు గుడ్ న్యూస్. పరీక్ష తేదీలపై ఓ క్లారిటీ వచ్చింది. ఈసారి చాలా మార్పులు ఉండబోతున్నాయి.

  • Share this:
    జేఈఈ మెయిన్ 2021 పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. జేఈఈ మెయిన్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. 2021 ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. 2021 ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు పరీక్షలు ఉంటాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇంకొన్ని రోజుల్లోనే జేఈఈ మెయిన్ 2021 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA జేఈఈ మెయిన్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసి మళ్లీ వెనక్కి తీసుకుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరిన్ని మార్పులతో డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ ఎగ్జామ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఇంకొన్ని రోజుల్లోనే యాక్టివేట్ అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ ఫిబ్రవరి చివరి నాటికి ముగుస్తుంది.

    CBSE Board Exams 2021: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్... పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు

    ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    వచ్చే ఏడాది నుంచి ప్రతీ సంవత్సరం జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నాలుగు సార్లు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం ఏడాదికి రెండు సార్లే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జనవరిలో, ఏప్రిల్‌లో రెండుసార్లు మాత్రమే ఎగ్జామ్ జరిగేది. అయితే ఏడాదిలో జేఈఈ మెయిన్ నాలుగు సార్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ డిసెంబర్ 10న విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పారు. 2021 లో మొదటి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నోటిఫికేషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి.

    AP Anganwadi Jobs 2020: అంగన్వాడీలో 855 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    SSC Recruitment 2020: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచారు... ఇంటర్ పాసైతే చాలు

    ఫిబ్రవరి సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా జేఈఈ మెయిన్ 2021 నిర్వహించే అవకాశం ఉంది. ప్రతీ నెల రెండు వారాల పాటు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాంతీయ భాషల్లో కూడా జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. 12 భాషల్లో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్ భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలు ముగిసిన నాలుగైదు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తారు. కాబట్టి విద్యార్థులు తర్వాతి నెలలో పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన ర్యాంక్స్‌ని బట్టి అడ్మిషన్లు లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published: