హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Part 2 Application Documents: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

TSLPRB Part 2 Application Documents: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను పోలీస్ నియామక మండలి అక్టోబర్ 21 సాయంత్రం ఫైనల్ కీతో పాటు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఓఎంఆర్ పత్రాలను మాత్రం అర్థరాత్రి 11 గంటల తర్వాత అందుబాటులోకి తెచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Exam) ఫలితాలను పోలీస్ నియామక మండలి(TSLPRB) అక్టోబర్ 21 సాయంత్రం ఫైనల్ కీతో పాటు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఓఎంఆర్ పత్రాలను మాత్రం అర్థరాత్రి 11 గంటల తర్వాత అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ప్రతీ ఒక్కరూ పార్ట్ 2(ఫైనల్ అప్లికేషన్) అప్లికేషన్ ఫారమ్ ను నింపాలని టీఎస్ఎల్పీఆర్బీ(TSLPRB) ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. ఈ అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 27 ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 10, 2022 రాత్రి 10 గంటల వరకు స్వీకరించనున్నారు. నవంబర్ 10 తర్వాత అప్లికేషన్స్ ను స్వీకరించే ప్రసక్తే లేదని వెబ్ నోట్ ద్వారా తెలియజేశారు.

మొత్తం దాదాపు 2.69 లక్షల మంది ఈ పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపారు. అంటే రోజుకు దాదాపు 18 వేల మంది చొప్పున అప్లికేషన్స్ పెట్టుకునే వీలు ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ఏర్పడే వెబ్ సైట్స్ ఎర్రర్స్ తో ఇబ్బందులు పడకుండా.. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అప్లికేషన్స్ ను పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఈ అప్లికేషన్ లో పేర్కొన్నఅన్ని వివరాలను నింపి.. కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి. తర్వాత అర్హతగల అభ్యర్థుల డాక్యుమెంట్స్ ను వెరిఫై చేస్తారు. తర్వాత.. పీఈటీ(PET) అండ్ పీఎంటీ(PMT)కి కాల్ లెటర్స్ ను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ లోఅందుబాటులో ఉంచుతారు. ఈ ఇంటిమేషన్ లెటర్ లోనే ఎప్పడు, ఎక్కడ ఈవెంట్స్ నిర్వహించేది పొందుపరుస్తారు.

PM Modi-Rozgar Mela: పండుగ వేళ.. ఉద్యోగాల మేళ.. ప్రారంభించిన ప్రధాని మోదీ ..

ఈ డాక్యుమెంట్స్ అవసరం..

1. డేట్ ఆఫ్ బర్త్ కొరకు DOB సర్టిఫికేట్ లేదా.. పదో తరగతి మెమోను అప్ లోడ్ చేయాలి.

2. ఎస్సై అభ్యర్థులు అయితే.. డిగ్రీ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంటర్మీడియ్ మెమోను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.

3.బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కింద వర్తిస్తే.. నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీటిని ఎంఆర్ఓల ద్వారా జారీ చేయపడతాయి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఏప్రిల్ 1, 2021 తర్వాత తీసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు.

4.ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు EWS సర్టిఫికేట్ ను తీసుకోవాలి. వీటిని అప్లికేషన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

5.1 నంచి 10వ తరగతి వరకు స్డడీ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదంటే.. 1 నుంచి 7వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా సరిపోతుంది.

6.ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పినిసరిగా ఉండాలి.

7.ఏజెన్స్ ఏరియాకు చెందిన వారు.. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

7.ఆధార్ కార్డు, పరీక్ష హాల్ టికెట్స్ ను కూడా దగ్గర ఉంచుకోవాలి.

8.ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు రిజర్వేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

9.ఇంతక ముందు నుంచే ప్రభుత్వం ఉద్యోగంలో కొనసాగుతున్న వారు.. సర్వీస్ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. నో డ్యూ సర్టిఫికేట్(No Due Certificate) కూడా అవసరం అవుతంది.

TSLPRB Results: ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల.. 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత.. ఇలా చెక్ చేసుకోండి..

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో.. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరైతే.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించారు. వ్యక్తిగత లాగిన్ లోనే ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించిన వారి జాబితా.. ఉత్తీర్ణత సాధించని వారి జాబితాను పొందుపరిచారు. వీటితో పాటే.. ఓఎంఆర్ షీట్లను కూడా అప్ లోడ్ చేశారు.

First published:

Tags: Career and Courses, Google documents, JOBS, Jobs in telangana, Tslprb

ఉత్తమ కథలు