Home /News /jobs /

ALERT FOR RRB NTPC CANDIDATES MINISTRY OF RAILWAYS CONSTITUTES HIGH POWER COMMITTEE TO RECEIVE GRIEVANCES ON NTPC CBT 1 RESULT SS

RRB NTPC Alert: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలపై ఫిర్యాదులు సబ్మిట్ చేసే అవకాశం

RRB NTPC Alert: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలపై ఫిర్యాదులు సబ్మిట్ చేసే అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Alert: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలపై ఫిర్యాదులు సబ్మిట్ చేసే అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Alert | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలపై (RRB NTPC CBT 1 Results) అనుమానాలు ఉన్న అభ్యర్థులకు అలర్ట్. ఈ ఫలితాలపై అభ్యర్థులకు ఉన్న సందేహాలు తీర్చుకోవడానికి, ఫిర్యాదులు సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తోంది భారతీయ రైల్వే.

ఇంకా చదవండి ...
    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసిన విధానంపై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కూడా దిగుతున్నారు. దీంతో భారతీయ రైల్వే హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు ఈ హైపవర్ కమిటీ పనిచేస్తుంది. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడానికి పాటించిన పద్ధతిని ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ ఫలితాలపై సందేహాలు ఉన్న అభ్యర్థులు తమ ఫిర్యాదును రిజిస్టర్ చేయొచ్చు. ​rrbcommittee@railnet.gov.in మెయిల్ ఐడీకి తమ కంప్లైంట్స్ పంపొచ్చు.

    అన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ఛైర్‌పర్సన్స్ కూడా ప్రస్తుతం ఉన్న మార్గాల ద్వారా అభ్యర్థుల ఫిర్యాదుల్ని స్వీకరించాలని భారతీయ రైల్వే సూచించింది. ఈ ఫిర్యాదులన్నింటినీ సంకలనం చేసి కమిటీకి పంపాలని ఆదేశించింది. అభ్యర్థులు తమ ఫిర్యాదులు పంపడానికి 2022 ఫిబ్రవరి 16 వరకు అవకాశం ఉంది. ఈ ఫిర్యాదుల్ని కమిటీ పరిశీలించిన తర్వాత 2022 మార్చి 4 లోగా తమ సిఫార్సుల్ని సమర్పిస్తుంది.

    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం రాదు


    అయితే అభ్యర్థుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిశీలించేందుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసినందను 2022 ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 2022 ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1 వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది భారతీయ రైల్వే.

    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 35,281 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారితో పాటు పలు కారణాల వల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 పలుమార్లు వాయిదాపడింది. ఇటీవలే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 దశలవారీగా పూర్తైంది. కొద్ది రోజుల క్రితం ఫలితాలు వచ్చాయి. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు 7,05,620 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ఆర్ఆర్‌బీ.

    Post Office Jobs 2022: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... రూ.63,200 వేతనం

    ఈ ఫలితాలపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొనడంతో ఆర్ఆర్‌బీ (CEN) 01/2019 నోటిఫికేషన్‌లో ప్యారా 13 లో వివరించినట్టుగానే అభ్యర్థులను రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎంపిక చేశామని భారతీయ రైల్వే వివరణ కూడా ఇచ్చింది. అయినా అభ్యర్థుల్లో అనుమానాలు తీరకపోవడంతో ఇప్పుడు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Indian Railways, JOBS, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు