హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... భారతీయ రైల్వేలో 1,24,000 ఉద్యోగాల భర్తీ

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... భారతీయ రైల్వేలో 1,24,000 ఉద్యోగాల భర్తీ

Railway Jobs 2022 | భారతీయ రైల్వేలో త్వరలో 1,24,000 ఉద్యోగాలు (RRB Jobs) భర్తీ కానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న పరీక్షలు కూడా త్వరలో జరగనున్నాయి.

Railway Jobs 2022 | భారతీయ రైల్వేలో త్వరలో 1,24,000 ఉద్యోగాలు (RRB Jobs) భర్తీ కానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న పరీక్షలు కూడా త్వరలో జరగనున్నాయి.

Railway Jobs 2022 | భారతీయ రైల్వేలో త్వరలో 1,24,000 ఉద్యోగాలు (RRB Jobs) భర్తీ కానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న పరీక్షలు కూడా త్వరలో జరగనున్నాయి.

  భారతీయ రైల్వేలో 1,24,000 పోస్టుల్ని (Railway Jobs) భర్తీ చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వేర్వేరు రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్లలో ఉన్న ఈ రైల్వే ఉద్యోగాల కోసం 1.4 కోట్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2019 లెవెల్ 1 ఎగ్జామ్ ఫిబ్రవరి 23న జరగనుందని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లక్నోలో బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర జర్నలిస్టులతో మాట్లాడుతూ అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు. భారతీయ రైల్వేలో 12 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వేర్వేరు విభాగాల్లో లక్షల ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

  అయితే ఇటీవల రైల్వే ప్రైవేటీకరణపై వస్తున్న ఆరోపణల్ని రైల్వే మంత్రి ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు రూమర్స్ ప్రచారం చేస్తున్నాయని రైల్వే మంత్రి ఆరోపించారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తామనన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. రైల్వే లైన్లు, రైలు కంపార్ట్‌మెంట్లకు ఎలక్ట్రిసిటీ లైన్లు, ఇంజిన్లు, రైల్వే స్టేషన్లు మొత్తం ప్రభుత్వానివేనని అన్నారు. భారతదేశంలో 200 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసే పనులన్ని ప్రభుత్వం చేపట్టిందని, 2023 నాటికి ఇది పూర్తవుతుందన్నారు.

  TTD Recruitment 2022: పలు ఖాళీల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్... విద్యార్హతలివే

  ఇక ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2019 నోటిఫికేషన్‌కు సంబంధించి జనవరి 15న జరిగిన మొదటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వే 35,281 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌లో క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

  Prasar Bharti Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... రూ.55,000 వరకు వేతనం

  భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మూడేళ్ల క్రితం విడుదలైన ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సాంకేతిక కారణాలతో పాటు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎగ్జామ్ వాయిదా పడింది. ఇటీవల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ముగిసింది. ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

  ఇక రైల్వేలో వేర్వేరు జోన్లు, ప్రొడక్షన్ యూనిట్లు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారు పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు.

  First published:

  Tags: Central Government Jobs, Govt Jobs 2022, Indian Railways, JOBS, Railway Apprenticeship, Railway jobs

  ఉత్తమ కథలు