JEE Mains, NEET 2021: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల​పై తాజా అప్​డేట్... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

JEE Mains, NEET 2021: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల​పై తాజా అప్​డేట్... ఎగ్జామ్స్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

JEE Mains, NEET 2021 Update | జేఈఈ మెయిన్స్ 2021, నీట్ 2021 అభ్యర్థులకు అలర్ట్. పరీక్ష షెడ్యూల్, ముఖ్యమైన తేదీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ఇంజినీరింగ్​, మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్స్​, నీట్​ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్​ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా.. మిగిలిన రెండు సెషన్లను జూలై, ఆగస్టులో.. నీట్​ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించాలని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ తొలుత భావించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నందున, ఈ పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, నీట్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించి కొత్త షెడ్యూల్​ను విడుదల చేస్తామని తెలిపింది. నీట్​ యూజీ–2021 దరఖాస్తు ఫారం, షెడ్యూల్, బ్రోచర్, అడ్మిట్ కార్డ్, ఆన్సర్ కీ, రిజల్ట్, కటాఫ్​కు సంబంధించిన అన్ని ముఖ్యమైన అప్​డేట్లను neet.nta.nic.inలో పొందుపర్చనున్నట్లు పేర్కొంది.

నీట్​ యూజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ


ఎన్‌టీఏ గత నెల ప్రారంభంలో నీట్–2021 అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అభ్యర్థులందరూ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నీట్–2021 దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దానిలో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేరు, నేషనాలిటీ, పుట్టిన తేదీ, వర్గం, మొబైల్ నంబర్, ఐడి ప్రూఫ్​, 10, 11 తరగతి వివరాలు ,12, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్​, ఎగ్జామ్​ సెంటర్​ సెలక్షన్​ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత నిర్ణీత ఫీజు చెల్లించి స్కాన్ చేసిన పాస్​పోర్ట్ సైజ్ ఫోటోను అప్​లోడ్​ చేయాలి. కాబట్టి, అభ్యర్థులంతా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్దంగా ఉంచుకోవాలని ఎన్​టీఏ సూచించింది.

SBI Jobs Recruitment 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

IT Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నాయా? గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్

JEE మెయిన్ పరీక్ష ఎప్పుడంటే?​


ఐఐఐటీ, ఎన్​ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్​ ప్రవేశాలు పొందేందుకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్స్​ పరీక్ష కూడా వాయిదా పడుతూ వస్తోంది. JEE మెయిన్ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా, జెఈఈ మెయిన్–2021 ఏప్రిల్, మే సెషన్లు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ మాట్లాడుతూ “కోవిడ్​–19 ప్రస్తుత పరిస్థితిని గమనించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, JEE (మెయిన్)–2021 సెషన్ వాయిదా వేశాం. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం, తాజా అప్​డేట్స్​ కోసం విద్యార్థులు ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి” అని చెప్పారు.

Railway Jobs 2021: రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

TGT Recruitment 2021: మొత్తం 5807 టీచర్ జాబ్స్‌కు దరఖాస్తు గడువు పెంపు

ఇప్పటికే మొదటి రెండు సెషన్లు పూర్తవ్వగా.. మిగిలిన 3, 4 సెషన్ల పరీక్ష తేదీలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. దేశం కోవిడ్ నుంచి మెల్లగా కోలుకుంటున్నందున JEE మెయిన్ పరీక్ష తేదీలను తర్వలోనే ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోన్న 3, 4 సెషన్ల పరీక్షలు జూలై 25, ఆగస్టు 15 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. జెఈఈ మెయిన్–2021 పరీక్ష తేదీపై తాజా అప్​డేట్స్​ కోసం ఈ పేజీని లేదా అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in ను సందర్శించాలని ఎన్​టీఏ కోరింది.
Published by:Santhosh Kumar S
First published: