మీ అర్హతలకు తగ్గ ఉద్యోగం కావాలా? తగిన అర్హతలు ఉన్నా మంచి ఉద్యోగం దొరకట్లేదా? నిరుద్యోగులు తమ అర్హతలు తగ్గ ఉద్యోగాలను వెతుక్కోవడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్, వెబ్‌సైట్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో రిజిస్టర్ చేసుకున్నవారు తమ అర్హతలకు తగ్గ జాబ్స్ ఏవైనా ఉంటే యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో సులువుగా చూసుకోవచ్చు. బడాబడా ప్రైవేట్ సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి. డీట్ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటికే జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, స్విగ్గీ లాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. డీట్ ప్లాట్‌ఫామ్‌లో 45,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. డీట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం ఉచితమే. మరి డీట్ ప్లాట్‌ఫామ్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.
ముందుగా డీట్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Job Seeker ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాతి పేజీలో Sign up పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
కొత్త పేజీలో మీ పూర్తి పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ ఎంటర్ చేయండి.
పాస్‌వర్డ్‌తో పాటు ఎంటర్ చేసి లొకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
మీరు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నట్టైతే Yes పైన లేకపోతే No పైన టిక్ చేయాలి.
చివర్లో Register పైన క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మరో కొత్త పేజీ వస్తుంది.
అందులో మీ పూర్తి అడ్రస్, విద్యార్హతలు, ఎలాంటి ఉద్యోగం కోరుకుంటున్నారు, మీకు తెలిసిన భాషలు, మీ నైపుణ్యాలు ఎంటర్ చేయాలి.
మీకు ఏదైనా రంగంలో అనుభవం ఉంటే ఆ వివరాలు తెలపాలి. ఇవన్నీ Basic Info కిందకు వస్తాయి.
Secondary Info సెక్షన్‌లో మీ విద్యార్హతలు, అనుభవం, మీరు కోరుకుంటున్న వేతనం వివరాలను తెలపాలి.
మీ రెజ్యూమె, ఐడీకార్డ్, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదు.
డాక్యుమెంట్స్ ఏవైనా కేవలం Pdf, Doc, Docx ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. డీట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఏవైనా ఉంటే అలర్ట్స్ వస్తాయి.
ఈ యాప్‌లో తరచూ లాగ్ ఇన్ అవుతూ ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చు.
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://tsdeet.com వెబ్‌సైట్ చూడండి. డీట్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Photos: రిలయెన్స్ ట్రెండ్స్ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి
ఇవి కూడా చదవండి:
Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే
Army Jobs: కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... దరఖాస్తుకు 10 రోజులే గడువు
Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.