Jobs: నిరుద్యోగులకు షాక్... ఆ జాబ్ నోటిఫికేషన్ రద్దు

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం జాబ్ నోటిఫికేషన్లపై పడుతోంది. కోవిడ్ 19 కారణంగా పలు జాబ్ నోటిఫికేషన్లు వాయిదా పడితే ఇంకొన్ని రద్దవుతున్నాయి.

news18-telugu
Updated: July 10, 2020, 6:27 PM IST
Jobs: నిరుద్యోగులకు షాక్... ఆ జాబ్ నోటిఫికేషన్ రద్దు
Jobs: నిరుద్యోగులకు షాక్... ఆ జాబ్ నోటిఫికేషన్ రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు షాకింగ్ న్యూస్. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ తన అధికారిక వెబ్‌సైట్ https://joinindiancoastguard.gov.in/ లో వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చిలో దరఖాస్తుల్ని స్వీకరించింది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆగస్ట్ 2020 సెషన్ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది. ఏప్రిల్‌లోనే పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్ష జరగలేదు. ఎగ్జామ్ త్వరలో ఉంటుందని అభ్యర్థులు భావించారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసినట్టు తాజాగా ప్రకటించింది. దీంతో ఈ నోటిఫికేషన్‌కు ఇప్పటికే దరఖాస్తు చేసి పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరాశ తప్పలేదు. అయితే మళ్లీ ఈ నియామక ప్రక్రియ చేపడతారా లేదా అన్న విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించలేదు.

GGH Kakinada Jobs: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రతీ సంవత్సరం రెండు సార్లు యాంత్రిక్ పోస్టుల భర్తీ చేపడుతుంటుంది. కోస్ట్ గార్డ్‌లో టెక్నికల్ పోస్టులు కోరుకునేవారు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ (రేడియో / పవర్) ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా పాసైనవారు దరఖాస్తు చేస్తుంటారు. ప్రస్తుతం ఆగస్ట్ 2020 సెషన్ నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://joinindiancoastguard.gov.in/ ఫాలో కావాలి.
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading