ALERT FOR JOBSEEKERS ALLIANCE AIR AVIATION LIMITED CONDUCTING WALK IN INTERVIEW FROM TOMORROW TO FILL 40 SUPERVISOR SECURITY POSTS SS
Air India Recruitment 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
Air India Recruitment 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
(ప్రతీకాత్మక చిత్రం)
Air India Recruitment 2021 | ఎయిర్ ఇండియా సెక్యూరిటీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk-In-Interview) నిర్వహిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.
డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. ఎయిర్ ఇండియా (Air India) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సూపర్వైజర్ సెక్యూరిటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ (Walk-In-Interview) నిర్వహిస్తోంది ఎయిర్ ఇండియా. ఆసక్తి గల అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ తెలుసుకోండి.
Air India Recruitment 2021: వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే...
భర్తీ చేసే పోస్టు- సూపర్వైజర్ సెక్యూరిటీ
మొత్తం ఖాళీలు- 40
విద్యార్హతలు- ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి. BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి.
శారీరక ప్రమాణాలు- మహిళలు కనీసం 154.5 సెంటీమీటర్లు, పురుషులు 163 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 2.5 సెంటీమీటర్ల సడలింపు ఉంటుంది.
వయస్సు- 2021 డిసెంబర్ 15 నాటికి 45 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీలు- 2021 డిసెంబర్ 15, 16
అభ్యర్థులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://www.airindia.in/careers.htm నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. టెన్త్, డిగ్రీ, BCAS Basic AVSEC, క్యాస్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి. “ALLIANCE AIR AVIATION LIMITED”, payable at New Delhi పేరుతో రూ.1,000 డీడీ తీసి అప్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫామ్ తీసుకొని 2021 డిసెంబర్ 15, 16 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.