IT Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర

IT Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర (ప్రతీకాత్మక చిత్రం)

IT Jobs 2021 | ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌తో పాటు ఇతర ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియాలోని ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయి.

  • Share this:
ఏటా నిరుద్యోగుల శాతం పెరుగుతూనే ఉంది. ఇదే సమయంలో కంపెనీల్లో ఉద్యోగాల కొరత కూడా అలాగే ఉంది. అయితే ఇటీవలే కాలంలో ఉద్యోగ నియామకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గత ఆరు నెలల్లో(జూన్ 2021 ముగిసే నాటికి) భారత్‌లో టాప్-10 ఐటీ కంపెనీలు 1.21 లక్షల మందిని నియమించుకున్నాయి. గత ఐదేళ్లలో ఇంత భారీగా ఉద్యోగ నియామకాలు జరగడం ఇదే అత్యధికం. కరోనా మహమ్మారి టెక్కీలకు బలమైన డిమాండ్ సృష్టించింది. మహమ్మారి వల్ల డిజిటల్ వైపు మళ్లడం వేగవంతం అయినప్పటికీ భారత్‌లో కొన్ని పెద్ద కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ ఏడాది తమ ఆదాయంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గత ఐదేళ్లను గమనిస్తే 2019లో మొదటి ఆరు నెలలకు రెండో అత్యధిక నికర నియామకాలు జరిగాయి. టాప్-10లో ఉన్న కంపెనీలు 45,649 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది 2 లక్షల నియామకాలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు. గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ డిజిటల్‌లో పెట్టుబడి పెట్టడంతో డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Railway Jobs: రూ.92,300 వరకు వేతనంతో రైల్వే ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో 158 జాబ్స్... ఈరోజే లాస్ట్ డేట్

ఐదేళ్లలో గరిష్ఠ స్థాయి


4.5 మిలియన్లకు పైగా నియామకాలతో సాఫ్ట్ వేర్ రంగం దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తగా తొలి స్థానంలో ఉంది. ఇందులో భారతీయ ఐటీ సంస్థలు, బీపీఎంతో పాటు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. జీడీపీలో ఐటీ రంగం వాటా క్రమేణా వృద్ధి చెందుతూ వస్తోంది. 1992-93లో 0.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 8 శాతానికి పెరిగింది. అంతేకాకుండా దీని పరిమాణం 1991లో 150 మిలియన్ డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 194 బిలియన్ డాలర్లకు చేరింది.

గత ఐదేళ్లలో నికర నియమకాలు విపరీతంగా పెరిగాయి. టాప్-10 ఐటీ సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య ఐదు సంవత్సరాల్లో 10 లక్షల నుంచి 40 శాతం పెరిగి 14 లక్షలకు చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 2 లక్షలు, HCL, టెక్ మహీంద్రా వరుసగా 1.76 లక్షలు , 1.26 లక్షల ఉద్యోగులను నియమించుకున్నాయి. వాస్తవానికి 5 లక్షల మంది ఉద్యోగులతో టీసీఎస్ దేశంలో అతిపెద్ద ప్రైవేటు సంస్థగా గుర్తింపు పొందింది. ప్రభుత్వాధీనంలో ఉన్న రైల్వే శాఖను కూడా అధిగమించింది.

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేసినవారికి అలర్ట్... ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... రూ.70,000 పైనే జీతం

రెండంకెల వృద్ధి నమోదు


2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం వల్ల ఈ నియామకాలు మరింత పెరిగాయని క్రెయా వర్సిటీ ఆచార్యులు రామ్ కుమార్ రామ్మూర్తి అన్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ ఉంది. ఫలితంగా రాబోయే త్రైమాసికంలో మరింత పెరుగుతాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. దశాబ్దం క్రితం మాదిరి కాకుండా ప్రస్తుతం ఒకే టెక్నాలజీ కాకుండా విభిన్న రకాల సాంకేతికతల సంగమం ఏర్పడిందని మాజీ ఐటీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

కృత్రిమ మేధస్సు, loT, రోబోటిక్స్, క్లౌడ్, 5జీ లాంటి బహుళ సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయని, టెక్నాలజీ వైవిధ్యం కారణంగా ప్రస్తుతం అవసరాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే సాంకేతికతకు సంబంధించి పరిమిత సంఖ్యలో శిక్షణ పొందిన వ్యక్తులు ఉండటంతో వల్ల వారికి డిమాండ్ తో పాటు జీతం పెంచడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published: