హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs Hiring: ఈ రంగాల్లో మీకు నైపుణ్యం ఉందా? ఉద్యోగాల జాతర మొదలైంది

Jobs Hiring: ఈ రంగాల్లో మీకు నైపుణ్యం ఉందా? ఉద్యోగాల జాతర మొదలైంది

Jobs Hiring: ఈ రంగాల్లో మీకు నైపుణ్యం ఉందా? ఉద్యోగాల జాతర మొదలైంది
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs Hiring: ఈ రంగాల్లో మీకు నైపుణ్యం ఉందా? ఉద్యోగాల జాతర మొదలైంది (ప్రతీకాత్మక చిత్రం)

Jobs Hiring | కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఉద్యోగం కోల్పోయారా? అనేక రంగాల్లో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

దేశంలో కరోనా వైరస్​ రెండో వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్ నిబంధనలు సడలిపోయాయి. ఈ తరుణంలో అనేక రంగాల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆర్థికంగా పరిస్థితులు సైతం పుంజుకుంటున్నాయి. దీంతో చాలా రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగుల నియామకాలను వేగవంతం చేశాయి. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో ఐటీ సెక్టార్ ముందుండగా.. హెల్త్ కేర్, ఆటోమొబైల్స్​, ఇన్సూరెన్స్​, ఫార్మాసూటికల్స్ రంగాలు ముందుతున్నాయి. ఈ విషయాన్ని టీమ్​లీజ్ ఎంప్లాయిమెంట్ ఔట్​లుక్ రెండో క్వార్టర్స్​ రిపోర్టు వెల్లడించింది. అనేక రంగాల్లో ఎంప్లాయిమెంట్ హైరింగ్ పెరిగిందని చెప్పింది.

“రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో దాదాపు వ్యాపార కార్యకలాపాలన్నీ మళ్లీ ప్రారంభమయ్యాయి. సేల్స్​, మార్కెటింగ్ ఊపందుకున్నాయి. దీంతో షాప్​ ఫ్లోర్ స్టాఫ్​ సిబ్బంది నియామకాలు ఎక్కువయ్యాయి. అలాగే ఐటీ రంగం తర్వాత హెల్త్​కేర్​, ఫార్మా రంగాల్లోనూ ఉద్యోగాల కల్పన పెరిగిపోయింది. కన్స్యూమర్ గూడ్స్ సంస్థలు, నిత్యావసర వస్తువుల షాప్​లతో పాటు చాలా రంగాల సంస్థలు ఉద్యోగులను మళ్లీ నియమించుకుంటున్నాయి” అని నివేదిక వెల్లడించింది.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి అలర్ట్... ఆ జాబ్ నోటిఫికేషన్ నిలిపివేసిన ఇండియా పోస్ట్

RRB Group D Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 1,03,769 రైల్వే ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్

ముఖ్యంగా కరోనా ప్రభావం తర్వాత చాలా రంగాల కార్యాకలాపాల్లో ఆటోమేషన్, సాఫ్ట్​వేర్ సర్వీసెస్​కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఐటీ రంగంలోని సంస్థలు ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పర్యాటకం కూడా ఇటీవల మళ్లీ ప్రారంభం కావడంతో ట్రావెల్​, ఆతిథ్య, టూరిజం సంస్థలు మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే పరిస్థితులు అనిశ్చితగా ఉండడంతో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఆ సంస్థలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఆటోమొబైల్స్ అమ్మకాలు కూడా జోరందుకోవడంతో ఆ రంగంలోనూ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అన్ని సంస్థలు మొగ్గు చూపుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బజాజ్​ ఆటో, టాటా మోటార్స్​, హీరో మోటాకార్ప్​, ఫియట్​తో పాటు మరిన్ని సంస్థలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

Jobs: భారతీయ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

లాక్​డౌన్​లు ఉన్న కాలంలో చాలా రోజుల పాటు మూతపడిన మాల్స్ మళ్లీ తెరుచుకుంటున్నాయి. దీంతో రిటైల్​ షాపుల్లోనూ ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే నిర్మాణ రంగం కూడా ఊపందుకోవడంతో సిమెంట్, స్టీల్​కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో సిమెంట్, ఖనిజ సంస్థల్లోనూ ఉద్యోగాల కల్పన పెరిగింది. అయితే ప్రస్తుతానికి సంస్థలు ఎక్కువగా తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటుండగా.. పరిస్థితి మరింత మెరుగుపడిన తర్వాత శాశ్వత ఉద్యోగ నియామాకాలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు మూడోవేవ్ ఆందోళన కూడా కొన్ని రంగాలపై ఉందని చెబుతున్నారు.

First published:

Tags: Auto News, Automobiles, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Insurance, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

ఉత్తమ కథలు