Fake News: బొగ్గుగనుల్లో 88,585 ఉద్యోగాల పేరుతో మోసం... నకిలీ ప్రకటనలు నమ్మొద్దన్న కోల్ ఇండియా

కోల్ ఇండియాకు సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ పేరుతో అనుబంధ సంస్థ ఏదీ లేదని, తాము ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టలేదని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: August 19, 2019, 11:16 AM IST
Fake News: బొగ్గుగనుల్లో 88,585 ఉద్యోగాల పేరుతో మోసం... నకిలీ ప్రకటనలు నమ్మొద్దన్న కోల్ ఇండియా
Fake News: బొగ్గుగనుల్లో 88,585 ఉద్యోగాల పేరుతో మోసం... నకిలీ ప్రకటనలు నమ్మొద్దన్న కోల్ ఇండియా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 11:16 AM IST
సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ పేరుతో వెలువడిన ఉద్యోగ ప్రకటనతో తమకు సంబంధం లేదని భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ స్పష్టతనిచ్చింది. సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌‌లో 88,585 జాబ్స్ పేరుతో ఉద్యోగ ప్రకటన వైరల్‌గా మారింది. ఒకేసారి 88,585 పోస్టులు భర్తీ చేస్తున్నారన్న వార్తలు రావడంతో నిరుద్యోగులు నోటిఫికేషన్ గురించి ఆరా తీశారు. అయితే ఇది నకిలీ ప్రకటన అని కోల్ ఇండియా లిమిటెడ్ వివరణ ఇచ్చింది. నిరుద్యోగులను వలలో వేసుకునేందుకు కొన్ని సంస్థలు ఇలా నకిలీ ప్రకటనలు ఇచ్చాయని, వాటితో తమకు సంబంధం లేదని కోల్ ఇండియా లిమిటెడ్ చెబుతోంది. సెక్యురిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నారని హెచ్చరించింది. నకిలీ ఉద్యోగ ప్రకటనలపై కోల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ డివిజన్ ట్విట్టర్‌లో ఇచ్చిన వివరణ ఇదే.





కోల్ ఇండియాకు సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ పేరుతో అనుబంధ సంస్థ ఏదీ లేదని, తాము ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టలేదని స్పష్టం చేసింది. కోల్ ఇండియాలో జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలేవైనా www.coalindia.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు http://www.scclcil.in వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఉద్యోగ ప్రకటనకు కోల్ ఇండియాతో సంబంధం లేదని గుర్తించాలి. నకిలీ ఉద్యోగ ప్రకటనల వలలో పడి మోసపోవద్దు. ఏ ఉద్యోగ ప్రకటన అయినా సదరు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

EWS Quota: 10% ఈడబ్ల్యూఎస్ కోటాకు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...