• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • ALERT FOR JEE MAIN AND NEET UG 2021 CANDIDATES HERE IS THE NEW DATES OF THESE EXAMS NS GH

JEE Main, NEET అభ్యర్థులకు అలర్ట్.. ఆయా పరీక్షల నూతన తేదీల వివరాలివే

ప్రతీకత్మక చిత్రం

JEE Main 2021 - NEET 2021: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలకు సంబంధించిన నూతన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉంది. వ్యాపార, వాణిజ్యాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా చాలా వరకు కార్యక్రమాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేశారు. వీటిలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, నీట్ 2021 నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ ఈ అంశంపై దృష్టిసారించనుంది. రివ్యూ మీటింగ్ నిర్వహించి పరిస్థితిపై నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. పెండింగులో ఉన్న జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపైన త్వరలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తారని, ఆగస్టు 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. 12వ తరగతి బోర్డ్ పరీక్షలు రద్దు చేసిన అనంతరం ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన జేఈఈ మెయిన్ 2021 పరీక్షలను వాయిదా వేశారు.
Exams Cancelled: ఆ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు.. కేంద్రం మరో కీలక నిర్ణయం.. వివరాలివే

అయితే జేఈఈ మెయిన్స్ పరీక్షా తేదీని త్వరలోనే విడుదల కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పరీక్షలను జులై-ఆగస్టులో నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రెండు సెషన్ల జెఈఈ మెయిన్స్ 2021 పరీక్ష తేదీలను ఎగ్జామ్ కు 15 రోజుల ముందు విడుదల చేయనుంది. ఏప్రిల్, మే సెషన్లలో నిర్వహించాల్సిన ఈ పరీక్షా తేదీలను రీషెడ్యూల్ చేసి అధికారిక వెబ్ సైట్లో ప్రకటించనుంది.

అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి..
ఈ పరీక్షకు అప్లయి చేసుకున్న విద్యార్థులు jeemain.nta.nic.in, nta.ac.inని సందర్శించుకోవాలి. అంతేకాకుండా మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు ప్రిపరేషన్ ఆపకూడదని సూచించారు. 2021 సెషన్ నుంచి విద్యార్థులకు వారి స్కోర్ ను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించడానికి జేఈఈ మెయిన్ నుు ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తున్నారని గమనించాలి. ఫిబ్రవరి మొదటి దశ, మార్చిలో రెండో దశ జరిగింది. తర్వాతి దశలు ఏప్రిల్, మే నెలల్లో షెడ్యూల్ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.

మెడికల్ ఎంట్రన్ టెస్ట్ నీట్ 2021(NEET) పరీక్షా తేదీ ఆగస్టు 1 నుంచి నిర్వహించబోతున్నారనే సంగతి ఇప్పటికే తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) అప్లికేషన్ ఫారం ఇంకా విడుదల చేయని కారణంగా ఈ పరీక్ష వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీట్ 2021 పరీక్షను అక్టోబరులో నిర్వహించాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష తేదీ గురించి చుట్టూ అలుముకున్న ఈ గందరగోళ పరిస్థితుల్లో విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
Published by:Nikhil Kumar S
First published: