హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Tips: జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కోసం లాస్ట్ మినిట్ టిప్స్..!

Exam Tips: జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కోసం లాస్ట్ మినిట్ టిప్స్..!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Exam Tips: జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానుండగా, నీట్ పరీక్ష మే 7వ తేదీన జరగనుంది. దీంతో ప్రిపరేషన్ కావడానికి ఎక్కువ సమయం లేదు. ఈ క్రమంలో బెస్ట్ స్కోర్ చేయడానికి నిపుణులు సూచించిన లాస్ట్ మినిట్ టిప్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం.  

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జేఈఈ (JEE), నీట్ (NEET) వంటి ప్రవేశ పరీక్షలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పరీక్షలను క్లియర్ చేయడానికి విద్యార్థులు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానుండగా, నీట్ పరీక్ష మే 7వ తేదీన జరగనుంది. దీంతో ప్రిపరేషన్ కావడానికి ఎక్కువ సమయం లేదు. ఈ క్రమంలో బెస్ట్ స్కోర్ చేయడానికి నిపుణులు సూచించిన లాస్ట్ మినిట్ టిప్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం.

* మాక్ టెస్ట్‌ల ప్రాక్టీస్

నీట్ , జేఈఈ పరీక్షలకు సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో అభ్యర్థులు మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మాక్ టెస్ట్‌లు ద్వారా స్ట్రాంగ్, వీక్ పాయింట్స్ ఈజీగా గుర్తించడంతో పాటు టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. తద్వారా ఎగ్జామ్ సమయంలో ఒక్కో ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో తెలుస్తుంది.

* పరీక్ష ఫార్మాట్-సిలబస్‌పై పూర్తి అవగాహన

నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల సిలబస్, ఎగ్జామ్ ఫార్మాట్స్‌పై అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని నిపుణులు అంటున్నారు. తద్వారా కవర్ అయ్యే టాపిక్స్‌పై పట్టుసాధించడానికి, ఎప్పటికప్పుడు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో ప్రిపరేషన్ ఈజీగా, త్వరగా కంప్లీట్ అవుతుంది. ముఖ్యమైన ఫార్ములాలను కూడా క్రమం తప్పకుండా రివైజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డీటెయిల్డ్ చాఫ్టర్స్ ప్రిపరేషన్‌కు ప్రస్తుతం సమయం ఎక్కువ లేదు. దీంతో షార్ట్ నోట్స్ ద్వారా కీలమైన పాయింట్లను, ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ పై ఫోకస్ చేయాలి.

* మెయిన్ టాపిక్స్‌పై ఫోకస్

జేఈఈ, నీట్ పరీక్షల ప్రిపరేషన్‌కు ప్రస్తుతం ఎక్కువ సమయం లేదు. దీంతో ప్రతి అంశాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించకుండా బలమైన ఏరియాలపై ఫోకస్ చేయాలి. ముఖ్యంగా మెయిన్ టాపిక్స్‌పై దృష్టిసారిస్తూ పట్టుసాధించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : టీచింగ్ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉందా? అయితే.. ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

* ప్రిపరేషన్‌‌పై డిస్కషన్ వద్దు

జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్‌ను గురించి తోటివారితో, స్నేహితులతో అసలు చర్చించకూడదు. ఇలా చేయడం వల్ల ఇతర అభ్యర్థుల స్టడీకి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఒకరి ప్రిపరేషన్‌ను మరొకరితో పోల్చుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది, దీంతో ప్రిపరేషన్ విషయాలపై గోప్యత పాటించాలి.

* ప్రిపరేషన్‌లో బ్రేక్స్ తీసుకోవడం

జేఈఈ, నీట్ పరీక్షల ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ప్రతి గంటకు 5 లేదా 10 నిమిషాల విరామం తీసుకోవాలి. తద్వారా మైండ్ రిఫ్రెష్ అయిన ఏకాగ్రత మరింత పెరుగుతుంది. ప్రిపరేషన్‌‌ను టైమ్‌టేబుల్ ప్రకారం కొనసాగించాలని, రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. జంక్ ఫుడ్‌ నివారించి, మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా పరీక్షల సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చు. పరీక్ష రోజున ఎగ్జామ్ సెంటర్లకు త్వరగా చేరుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అవసరమైతే ముఖ్యమైన నోట్స్‌ను మనసులో రివైజ్ చేయడానికి సమయం ఉంటుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Jee, JOBS, NEET 2023

ఉత్తమ కథలు