Home /News /jobs /

ALERT FOR IT JOBSEEKERS SOFTWARE COMPANIES RISING FRESHERS SALARIES SS

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు
(ప్రతీకాత్మక చిత్రం)

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు (ప్రతీకాత్మక చిత్రం)

IT Jobs | ఐటీ ఉద్యోగాలు కోరుకునేవారికి అదిరిపోయే శుభవార్త. ఫ్రెషర్స్ వేతనాలను (Freshers Salary) భారీగా పెంచుతున్నాయి కంపెనీలు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారిలో టాలెంట్ ఉన్నవారిని నియమించుకునేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.

ఇంకా చదవండి ...
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు (IT Jobs) కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఐటీ కంపెనీలన్నీ ఫ్రెషర్స్ సాలరీని భారీగా పెంచేశాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ వేతనాలు పెరిగాయి. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఫ్రెషర్స్ సాలరీ (Freshers Salary) పెంచడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వలస కూడా పెరిగింది. దీంతో ప్రతిభ ఉన్న ఫ్రెషర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇండస్ట్రీ నిపుణుల సమాచారం ప్రకారం ఫ్రెషర్స్‌కి 15 శాతం నుంచి 60 శాతం వరకు అధిక వేతనాలు లభించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్ వేతనాన్ని రూ.3,65,000 నుంచి రూ.4,25,000 కి పెంచినట్టు వార్తలొస్తున్నాయి.

మరోవైపు హెచ్‌సీఎల్ ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుంటోంది. విద్యార్థులతో అనలిటిక్స్, డిజిటల్ కంటెంట్ కోర్సుల్ని చేయిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి రూ.6,00,000 వరకు ప్యాకేజీ ఇవ్వనుంది. హెచ్‌సీఎల్ ఫ్రెషర్స్ వేతనాలను పెంచడంతో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి కంపెనీలు కూడా అదే బాట పట్టే అవకాశముంది. ఈ ఏడాది కోర్సులు పూర్తి చేసి ఐటీ కంపెనీల్లో చేరేవారికి మంచి వేతనాలు లభించే అవకాశం కనిపిస్తోంది.

SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది. గతేడాది 23,000 ఫ్రెషర్స్‌ని మాత్రమే నియమించుకుంది. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేసింది. ఇక ఇన్ఫోసిస్ గతేడాది 85,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోగా ఈ ఏడాది 50,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకునే ఆలోచనలో ఉంది. ఇక టీసీఎస్ గతేడాది 78,000 మందిని నియమించుకోగా, ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వనుంది.

ఈ దిగ్గజ కంపెనీలు మాత్రమే కాకుండా చిన్నచిన్న ఐటీ కంపెనీలు కూడా టాలెంట్ ఉన్న ఫ్రెషర్స్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఐటీ రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఉద్యోగావకాశాలు ఇచ్చినట్టు నాస్‌కామ్ వెల్లడించింది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ప్రతీ ఏటా 18 లక్షల ఐటీ ఇంజనీర్లు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వారిలో టాలెంట్ ఉన్నవారిని నియమించుకోవడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి.

TCS Jobs for Women: మహిళలకు టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో టెక్నాలజీ వినియోగం పెరిగింది. దీంతో సాఫ్ట్‌వేర్ సేవల్ని అందించే ఐటీ కంపెనీలకు వ్యాపారం కూడా పెరిగింది. పలు రకాల సేవల కోసం అనేక సంస్థలు ఐటీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. వ్యాపారం పెరుగుతుండటం, సేవల్ని అందించేందుకు సరిపడా టాలెంట్ లేకపోవడం, ఉన్నవారు కూడా మరో కంపెనీకి వలస వెళ్తుండటంతో కంపెనీలు ఫ్రెషర్స్‌ని నియమించుకుంటున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Hcl, Infosys, JOBS, Private Jobs, TCS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు