Home /News /jobs /

ALERT FOR INTER PASSED STUDENTS APPLY FOR BTECH CADET ENTRY SCHEME IN INDIAN NAVY BEFORE 2021 OCTOBER 10 SS

Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో బీటెక్ చేయొచ్చు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో బీటెక్ చేయొచ్చు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో బీటెక్ చేయొచ్చు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy Recruitment 2021 | ఇండియన్ నేవీలో ఉద్యోగాలు (Indian Navy Jobs) కోరుకునేవారికి అలర్ట్. బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే అవకాశం ఉంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఇంటర్మీడియట్ పాస్ అయినవారికి శుభవార్త. ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను (10+2 BTech Cadet Entry Scheme) ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారు కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్స్ (B Tech Course) చేయాల్సి ఉంటుంది. 2022 జనవరిలో బీటెక్ డిగ్రీ కోర్స్ ప్రారంభం అవుతుంది. మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ నేవీ. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 1న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Indian Navy 10+2 BTech Cadet Entry Scheme: ఖాళీల వివరాలు ఇవే...

















    మొత్తం ఖాళీలు35
    ఎడ్యుకేషన్ బ్రాంచ్5
    ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్30

    APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 54 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

    Indian Navy 10+2 BTech Cadet Entry Scheme: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 1

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10

    ఇంటర్వ్యూ- 2021 అక్టోబర్ లేదా నవంబర్

    విద్యార్హతలు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 కనీసం 70 శాతం మార్కులతో పాస్ కావాలి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసినవాళ్లు దరఖాస్తు చేయాలి. టెన్త్ లేదా ఇంటర్‌లో ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.

    వయస్సు- 2002 జూలై 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయాలి.

    కోర్సులు- అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది.

    ఎంపిక విధానం- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

    ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం- విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా

    ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా

    Indian Navy 10+2 BTech Cadet Entry Scheme: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Current Events లో 10+2 B.Tech Cadet Entry Scheme లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థి తన వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయాలి.

    Step 5- ఆ తర్వాత బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయాలి.

    Step 6- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Indian Navy, Job notification, JOBS

    తదుపరి వార్తలు