డిప్లొమా పాస్ అయ్యారా? బీటెక్ పూర్తి చేశారా? ఎక్కడైనా పనిచేసిన అనుభవం కూడా ఉందా? భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ అయిన బౌన్స్‌లో (Bounce) పలు ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ అర్హతతో (B tech Jobs) మెయింటనెన్స్ ఇంజనీర్ పోస్టులున్నాయి. విద్యార్హతలతో పాటు ఒకటి నుంచి మూడేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. కూడా తప్పనిసరి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదివిన తర్వాత ఇమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. బౌన్స్‌లో మెయిటనెన్స్ విభాగంలో మెయింటనెన్స్ ఇంజనీర్ పోస్టులకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకోండి.
విద్యార్హతలివే...
డిపార్ట్మెంట్ | మెయింటనెన్స్ |
పోస్టు పేరు | మెయింటనెన్స్ ఇంజనీర్ |
రిపోర్టింగ్ మేనేజర్ హోదా | మెయింటనెన్స్ మేనేజర్ |
ప్రాంతం | భివాండి |
విద్యార్హతలు | ఎలక్ట్రికల్ లేదా మెకట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా డిప్లొమా పాస్ కావాలి. |
అనుభవం | 1 ఏళ్ల నుంచి 3 ఏళ్లు |
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ | careers@bounceshare.com |
Jobs in TCS: బీఏ, బీకామ్ పాసయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా
మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ 2018 మే లో ప్రారంభమైంది. వివేకానంద హల్లికేరి, అనిల్ జీ, వరుణ్ అగ్ని మానసపుత్రికే బౌన్స్ స్టార్టప్. రోజువారీ ప్రయాణం ఒత్తిడి లేకుండా, వేగంగా, నమ్మకంగా, సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో బౌన్స్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌గా ప్రారంభించబడింది. రైడ్-షేరింగ్ అవతార్‌తో, వివిధ రోజువారీ ప్రయాణికుల కోసం సరసమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. సుదూర ప్రాంతాలను కవర్ చేయడం నుంచి లాస్ట్ మైల్ సపోర్ట్ వరకు అన్ని అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.
బెంగళూరులో మొదట లాంఛైనా ఆ తర్వాత కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది. మొదటి ఏడాదిలోనే 30,000 పైగా స్కూటర్లతో రోజుకు 1,00,000 పైగా రైడ్స్ చేయడం విశేషం. రోజూ లక్షకు పైగా ట్రాన్సాక్షన్స్‌తో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందిన స్టార్టప్‌గా ఎదగడం విశేషం. మొదటి 11 నెలల్లోనే 500 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాల్యుయేషన్ చేరుకుంది. షేరింగ్ మొబిలిటీ బిజినెస్‌ను విస్తరిస్తూ, బౌన్స్ జ్యూనిక్‌లో ఇన్వెస్ట్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ పేరుతో భారతదేశంలోనే మొదటి స్వాపబుల్ బ్యాటరీ గల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bounce, CAREER, JOBS, Private Jobs