బిగ్ బుల్గా పేరొందిన దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్(Market Investor) రాకేష్ ఝున్‌ఝన్‌వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అకస పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్పారాయన. ఇటీవలే ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) పొందిన సంగతి విధితమే. అకస ఎయిరలైన్స్‌కు డీజీసీఏ అనుమతించడంతో.. ఈ నెలాఖరులోగా అకస ఎయిర్‌లైన్స్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అకస ఎయిర్‌లైన్స్ అన్ని పరీక్షలను ఎదుర్కొంది. పలుమార్లు ఆకాశంలో విజయవంతంగా చక్కర్లు కొట్టింది. అకస ఎయిర్‌లైన్స్‌కు ప్రస్తుతం రెండు 737 మ్యాక్స్ బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఈ రెండింటితో ఈ నెలాఖరులోగా కమర్షియల్ సర్వీసులు(Commercial Services) ప్రారంభించనున్నట్లు అకాశా ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎయిర్ లైన్ 18 ఎయిర్ క్రాఫ్ట్‌లు కలిగి ఉంటుంది.
ఆ తరువాత ప్రతి 12 నెలల్లో 12 నుంచి 14 విమానాలను జత చేస్తుంది. ఇలా తన ఆర్డర్‌లో భాగంగా 5 ఏళ్లలో మొత్తం 72 ఎయిర్ క్రాఫ్టులను సమకూర్చుకుంటుంది. గత నవంబరులో ఆకాశ ఎయిర్ 72 ఎయిర్ క్రాఫ్ట్ (బోయింగ్ 737 మాక్స్) లను బోయింగ్ నుంచి ఆర్డర్ చేసింది. 737 మ్యాక్స్‌కు చెందిన 737-8, 737-8-200 వెర్షన్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేసింది.
దీనిలో భాగంగా ఈ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగాల కోసం నియామకం చేస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో “WeAreHiring’’ అంటూ ఎయిర్ లైన్స్ సంస్థ ఓ ట్వీట్ చేశారు. ఆకాశంలో ఎగిరేందుకు మీకో అవకాశంగా ఈ నియామకాలు ఉంటాయన్నారు.
#WeAreHiring | Looking for our next Akasian.
It's Your Sky. Apply now: https://t.co/aZTWmsvEgF pic.twitter.com/hE6lXevRON
— Akasa Air (@AkasaAir) July 14, 2022
అకాశ ఎయిర్ ఓపెనింగ్స్ ఇలా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బంది, అనుభవజ్ఞులైన క్యాబిన్ సిబ్బంది(Cabin Crew), వైద్య సేవల కొరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన మేనేజర్ జాబ్స్, ఎగ్జిక్యూటివ్స్, DGCA ఆమోదించబడిన B-737 క్వాలిఫైడ్ SEP Instructers, DGCA ఆమోదించబడిన గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్ (GI) /సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్ (SME) B-737 క్వాలిఫైడ్ టెక్నికల్ అండ్ పెర్ఫార్మెన్స్ సబ్జెక్టులు, ప్రథమ చికిత్స బోధకుడు,
DGCA ఆమోదించబడిన క్రూ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (CRM) ఫెసిలిటేటర్/క్యాబిన్ క్రూ రికార్డ్స్. ఈ ఉద్యోగాలన్నీ ఫుల్ టైమ్ బీసిస్ పై ఉంటాయన్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో పని చేయాలసి ఉంటుంది. మొత్తం 100కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://www.akasaair.com/careersను సందర్శించి.. వివరాలను తెలుసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు.
క్యాబిన్ క్రూ (ఫ్రెషర్స్) - ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్..
వీరు కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకునే విధంగా శ్రద్ధగల, నైపుణ్యం కలిగిన, నిజమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు , ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. దీని కోసం పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఎక్సిపీరియన్స్ డ్ క్యాబిన్ క్రూ - ఇన్‌ఫ్లైట్ సేవలు
వీరు క్యాబిన్ సిబ్బంది బృందానికి నాయకత్వం వహించడానికి, నిర్వహించడానికి కావాలసిన అనుభవం గల అభ్యర్థుల కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు. కస్టమర్‌లకు అద్భుతమైన సేవలను అందించడం వీరి పని . సీనియర్ క్యాబిన్ క్రూ (SCC)గా కనీసం 1 సంవత్సరం అనుభవం ఉన్న క్యాబిన్ సిబ్బంది ఎవరైనా ఇన్‌ఫ్లైట్ మేనేజర్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీని కోసం పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Career and Courses, JOBS