దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.
ముఖ్య సమాచారం ..
పరీక్ష తేదీ | జనవరి 9, 2022 |
పరీక్ష సమయం | ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు |
అధికారిక వెబ్‌సైట్ | https://aissee.nta.nic.in/ www.nta.ac.in |
అర్హతలు..
- ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
ఆరోతరగతి ప్రవేశాలకు పరీక్ష విధానం..
టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
మ్యాథమెటిక్స్ | 50 | 3 | 150 |
ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
లాగ్వేజ్ | 25 | 2 | 50 |
జనరల్ నాలెడ్జ్ | 25 | 2 | 50 |
మొత్తం | 125 | 300 |
తొమ్మిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానం..
టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
మ్యాథమెటిక్స్ | 50 | 4 | 200 |
ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
లాగ్వేజ్ | 25 | 2 | 50 |
జనరల్ సైన్స్ | 25 | 2 | 50 |
సోషల్ సైన్స్ | 25 | 2 | 50 |
మొత్తం | 150 | 500 |
విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి: యూనిసెఫ్
ద్యాప్రమాణాలు పాటించడంలో భారత్ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్నట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్లడించారు.
ఈ సర్వేలో 21000 మంది పాల్గన్నారు. భారత్‌లో విద్యా ప్రమాణాలు పెరగడంపై యూనిసెఫ్ హర్షం వ్యక్తంచ ఏసింది. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో ఈ మార్పు ఆహ్వనించదగ్గదని పేర్కొన్నారు. కోవిడ్ (Covid 19) కారణంగా కొద్ది మంది బాలికలు ఇంటికే పరిమితమయ్యారు. తిరిగా మళ్లీ వారు వారిని పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలని సూచించింది.e
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.