Airtel: గ్రామీణ యువతకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్కిల్ ట్రైనింగ్

Airtel Payments Bank skill development | గ్రామీణ ప్రాంత యువతీయువకులకు శుభవార్త. ఉద్యోగావకాశాలను పెంపొందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించబోతోంది.

news18-telugu
Updated: July 22, 2020, 5:50 PM IST
Airtel: గ్రామీణ యువతకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్కిల్ ట్రైనింగ్
Airtel: గ్రామీణ యువతకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్కిల్ ట్రైనింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గ్రామీణ ప్రాంత యువతకు శుభవార్త. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై గ్రామీణ యువతకు ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పాటు ఉద్యోగాలు పొందేందుకు సహకారం అందించనుంది. బ్యాంకింగ్, పేమెంట్స్, ఇన్స్యూరెన్స్, వాటి అనుబంధ సేవలు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నా టైర్ 4, 5, 6 పట్టణాల్లో మార్కెట్ తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ భారీ అవకాశాలు ఉన్నాయి. అందుకే గ్రామీణ ప్రాంత యువతీయువకులకు ఈ అంశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది.

GGH Vijayawada Jobs: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 161 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SSC Jobs: 8 నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో బిజినెస్ కరస్పాండెంట్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ లాంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ అందించేలా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారు ఉద్యోగాలు పొందడం మాత్రమే కాదు స్థానికంగా డిస్ట్రిబ్యూటర్, రీసెల్లర్, ఆంట్రప్రెన్యూర్ అయ్యేలా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పూర్తైన తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌-NSDC ట్రైనింగ్ సెంటర్లలో డిజిటల్ బ్యాంకింగ్‌తో లాభాలు, ఉపాధి అవకాశాలను వివరిస్తూ సెషన్స్ నిర్వహించనుంది ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.
Published by: Santhosh Kumar S
First published: July 22, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading