AAI Jobs: మొత్తం 311 అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

AAI Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు www.aai.aero వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 20 చివరి తేదీ.

news18-telugu
Updated: September 18, 2019, 3:18 PM IST
AAI Jobs: మొత్తం 311 అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
AAI Jobs: మొత్తం 311 అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 18, 2019, 3:18 PM IST
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 311 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు www.aai.aero వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 20 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని నియమించనుంది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులే. లేహ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, భటిండా, లుధియానా, చండీగఢ్, జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్, ఉదయ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్, కోట, లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్, ఆగ్రా, వారణాసి, షిమ్లా, కులు, కాంగ్రా, డెహ్రడూన్, పాట్నాగర్, ఖజురహో, గ్వాలియర్, సఫ్దర్‌గంజ్ ఎయిర్‌పోర్టుల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AAI Recruitment 2019: ఖాళీల వివరాలు


మొత్తం ఖాళీలు-311

సివిల్ (గ్రాడ్యుయేట్): 60
సివిల్ (డిప్లొమా): 39
ఎలక్ట్రికల్ (గ్రాడ్యుయేట్): 37


ఎలక్ట్రికల్ (డిప్లొమా): 30
Loading...
ఎలక్ట్రానిక్స్ (గ్రాడ్యుయేట్): 41
ఎలక్ట్రానిక్స్ (డిప్లొమా): 31
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గ్రాడ్యుయేట్): 19
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిప్లొమా): 9
ఆటోమొబైల్ (గ్రాడ్యుయేట్): 4
ఆటోమొబైల్ (డిప్లొమా): 9
ఏరోనాటిక్స్ / ఏరోస్పేస్ (గ్రాడ్యుయేట్): 2
ఏరోనాటిక్స్ / ఏరోస్పేస్ (డిప్లొమా): 2
సెక్రెటేరియల్ ప్రాక్టీస్ (గ్రాడ్యుయేట్): 10
సెక్రెటేరియల్ ప్రాక్టీస్ (డిప్లొమా): 3
లైబ్రరీ సైన్స్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 1
మెటీరియల్ మేనేజ్‌మెంట్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 1
మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 10
రిఫ్రిజిరేషన్ / ఎయిర్ కండీషనింగ్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 1
సౌండ్ ఇంజనీరింగ్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 1
ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ (గ్రాడ్యుయేట్ / డిప్లొమా): 1

AAI Recruitment 2019: ఇతర వివరాలు


దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 26
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 20
వయస్సు: 26 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు
వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.15,000, డిప్లొమా అప్రెంటీస్‌కు నెలకు రూ.12,000 స్టైపెండ్.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...