భారత రక్షణ దళాల్లో కీలకమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లో ఇటీవల ఎటువంటి నియామాకాలు చేపట్టకపోవడంపై ఔత్సాహిక అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన గొంతుకను వినిపిస్తున్నారు.
భారత రక్షణ దళాల్లో కీలకమైన ఆర్మీ(Army), ఎయిర్ ఫోర్స్‌లో(Airforce) ఇటీవల ఎటువంటి నియామాకాలు చేపట్టకపోవడంపై ఔత్సాహిక అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ నిరసన గొంతుకను వినిపిస్తున్నారు. ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని డిమాండ్(Demand) చేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌ను(Recruitment) ఇప్పటికీ ముగించలేదని, కేవలం పరీక్షలు నిర్వహించి ఆర్మీ అధికారులు చేతులు దులుపుకొన్నారని, ఇంకా కట్-ఆఫ్ జాబితాను ప్రకటించలేదని డిఫెన్స్(Defence) ఔత్సాహిక అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఇండియన్ ఆర్మీ సైతం అభ్యర్థుల కోసం గత సంవత్సరం నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టకపోవడం గమనార్హం.
గరిష్ట వయోపరిమితి ఉన్న పరీక్షల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం వల్ల అర్హులైన వారు అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విషయాన్ని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE), ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫలితాలు, ఎన్రోల్మెంట్ తేదీలను వెంటనే ప్రకటించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రిచ్ పాల్ సరన్ అనే యువకుడు ఇలా స్పందించాడు.. ‘ఎయిర్ మెన్ నోటిఫికేషన్‌కు సంబంధించి అన్ని దశలను క్లియర్ చేశాం. అయితే ఉద్యోగంలో చేరడం కోసం గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్నామనీ, కానీ భారత ఆర్మీ హోల్డ్‌లో పెట్టింది.’ అని వాపోయాడు. తమకు ఎలా అయినా న్యాయం చేయాలని సదరు యువకుడు కోరాడు. #JusticeForDefenceStudents అనే యాష్ ట్యాగ్‌ను షేర్ చేశాడు.
These students dream to be a part of The Indian Army, 4th Largest Army in the world from their childhood.
No induction with a age limit too is killing their dream.
Lets not let their aspirations be buried in the soil! pic.twitter.com/ygjaDxOYfE
— DharmendraGatiyalaRLP (@d9choudhary) May 8, 2022
మరో ఔత్సాహిక యువకుడు ధర్మేంద్ర గటియాల కూడా ట్విట్టర్లో స్పందించాడు..‘చాలా మంది విద్యార్థులు తమ చిన్ననాటి నుండి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్మీ అయిన ఇండియన్ ఆర్మీలో భాగం కావాలని కలలు కంటున్నారు. వయోపరిమితితో కూడిన ఏ ఇండక్షన్ కూడా వారి కలను చంపడం లేదు. వారి ఆకాంక్షలను మట్టిలో సమాధి చేయనివ్వం.’ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.
మరో అభ్యర్థి అంకిత్ సర్కార్ ఇలా ట్వీట్ చేశాడు.. ‘నేను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరీక్షకు దరఖాస్తు చేసి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే తుది నమోదు జాబితా కోసం నేను ఇంకా వేచి చూస్తున్నాను. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. #Justice For Defence Students అనే యాష్ ట్యాగ్‌ను పీఎంవో ఆఫీస్‌కు, రాహుల్ గాంధీ, డిఫెన్స్ శాఖకు ట్యాగ్ చేశాడు.
మరో ఔత్సాహికుడు ఇలా ట్వీట్ చేశాడు..‘భారత వైమానిక దళం ఒక సంవత్సరం పాటు అదే నోటీసును పునరావృతం చేస్తోంది. మేం విద్యార్థుల వయసు దాటిపోతున్నాం. మేము 2 సంవత్సరాల నుండి పరీక్ష సన్నద్ధంలో కీలకమైన సమయాన్ని వెచ్చించాం. సార్ దయచేసి మాకు సహాయం చేయండి.’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇలా చాలా మంది ఔత్సాహికులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ట్యాగ్ చేసి సమాధానం చెప్పాలని కోరారు. ఇదిలా ఉండగా, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మే 21, మే 22 తేదీలలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా (పరీక్షలు లేకుండా) నేరుగా జూనియర్ రీసెర్చ్ ఫెలోలను నియమిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.