Air India Jobs: ఎయిర్ ఇండియాలో 70 ట్రైనీ ఉద్యోగాలు

Air India recruitment 2019 | సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, జూనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఓసారి అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవడం మంచిది.

news18-telugu
Updated: April 16, 2019, 2:47 PM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 70 ట్రైనీ ఉద్యోగాలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 70 ట్రైనీ ఉద్యోగాలు
  • Share this:
మీరు ఇంటర్ పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి. సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, జూనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది ఎయిర్ ఇండియా. మొత్తం 70 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. మే 6 నుంచి మే 9 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, జూనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఓసారి అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవడం మంచిది.

Air India Trainee Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం ఖాళీలు- 70

విద్యార్హతలు- మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్, 10+2
సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్, ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్: డీజీసీఏ ఫ్లైట్ డిస్‌ప్యాచర్ అప్రూవల్ తప్పనిసరి.
జూనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్: ఫ్లైట్ డిస్‌ప్యాచర్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.


Air India Trainee Jobs: స్టైపెండ్ వివరాలు

సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్: రూ.40,000
ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్: రూ.25,000
జూనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్‌ప్యాచర్: రూ.20,000
శిక్షణ పూర్తై డీజీసీఏ ఫ్లైట్ డిస్‌ప్యాచర్ అప్రూవల్ వచ్చిన తర్వాత నెలకు రూ.70,000 వేతనం లభిస్తుంది.

ఆసక్తిగల అభ్యర్థులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ airindia.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్ ఇండియా అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:

SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

Jio Cricket: కాంటెస్ట్‌లో లగ్జరీ ఇల్లు యువకుడి సొంతం... మీరూ గెలుచుకోవచ్చు ఇలా

JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్‌డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి
First published: April 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>