Air India Jobs: ఎయిర్ ఇండియాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

Air India Recruitment 2020 | ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ అయింది. 51 సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎయిర్ ఇండియా.

news18-telugu
Updated: March 3, 2020, 11:42 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
Air India Jobs: ఎయిర్ ఇండియాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలయెన్స్ ఎయిర్‌ కోసం సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 51 ఖాళీలను ప్రకటించింది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://www.airindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2020 మార్చి 4లోగా పంపించాలి.

Air India Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోస్టులు- 51
పురుషులు- 32
మహిళలు- 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 4
విద్యార్హత- ఏదైనా డిగ్రీ పాస్ కావడంతో పాటు ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాష మాట్లాడాలి. బీసీఏఎస్ బేసిక్ AVSEC సర్టిఫికెట్ ఉండాలి.శారీరక ప్రమాణాలు- పురుషులు 163 సెంటీమీటర్లు, మహిళలు 154.5 సెంటీమీటర్లు ఉండాలి.
వేతనం- రూ.22,371.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Alliance Air Personnel Department Alliance Bhawan,
Domestic Terminal -1,
l.G.I Airport,
New Delhi-110037.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 జాబ్స్... ఖాళీల వివరాలివే

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌‌పై క్లారిటీ... లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

CTET July 2020: గుడ్ న్యూస్... సీటెట్ 2020 గడువు మరోసారి పెంపు
Published by: Santhosh Kumar S
First published: March 3, 2020, 11:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading