Air India Jobs: ఎయిర్ ఇండియాలో 109 ఉద్యోగాలు... ఎల్లుండి నుంచి ఇంటర్వ్యూలు

Air India recruitment 2019 | అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మే13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

news18-telugu
Updated: May 11, 2019, 10:43 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 109 ఉద్యోగాలు... ఎల్లుండి నుంచి ఇంటర్వ్యూలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 109 ఉద్యోగాలు... ఎల్లుండి నుంచి ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-AIATSL ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. కస్టమర్ ఏజెంట్, డ్యూటీ మేనేజర్-టెర్మినల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎయిర్ ఇండియా. మొత్తం 109 పోస్టులున్నాయి. అందులో కస్టమర్ ఏజెంట్ పోస్టులు 100 కాగా, డ్యూటీ మేనేజర్-టెర్మినల్ పోస్టులు 9. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మే13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

Read this: Air India offer: టేకాఫ్‌కు 3 గంటల ముందు టికెట్ బుక్ చేస్తే 40% డిస్కౌంట్

Air India recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు: 109
కస్టమర్ ఏజెంట్: 100
డ్యూటీ మేనేజర్-టెర్మినల్: 09
విద్యార్హతలు: కస్టమర్ ఏజెంట్ పోస్టుకు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత రంగంలో ఒక ఏడాది అనుభవం తప్పనిసరి. డ్యూటీ మేనేజర్-టెర్మినల్ పోస్టుకు డిగ్రీతో పాటు 16 ఏళ్ల అనుభవం ఉండాలి.వయస్సు: డ్యూటీ మేనేజర్-టెర్మినల్ వయస్సు 55 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. కస్టమర్ ఏజెంట్ వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.
వేతనం: డ్యూటీ మేనేజర్-టెర్మినల్ జీతం రూ.45000, కస్టమర్ ఏజెంట్ జీతం రూ.20190.
సెలెక్షన్: స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌తో పాటు సర్టిఫికెట్స్‌తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. 'AIR INDIA AIR TRANSPORT SERVICES LTD, Mumbai' పేరుతో డీడీ తీసుకోవాలి. ఈ కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
Systems & Training Division 2nd floor,
GSD Complex, Near Sahar Police Station,
Airport Gate No.-5, Sahar, Andheri-E,
Mumbai-400099.

ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
Published by: Santhosh Kumar S
First published: May 11, 2019, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading