Air India Jobs: అమ్మాయిలకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... రేపే ఇంటర్వ్యూ

Air India Recruitment 2019 | ఇంటర్వ్యూ రోజున నేరుగా దరఖాస్తు ఫామ్ అందించాల్సి ఉంటుంది. జూలై 9న పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

news18-telugu
Updated: July 8, 2019, 2:40 PM IST
Air India Jobs: అమ్మాయిలకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... రేపే ఇంటర్వ్యూ
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే (image: Air India)
news18-telugu
Updated: July 8, 2019, 2:40 PM IST
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్-AIEL క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు అమ్మాయిలకు మాత్రమే. అది కూడా పెళ్లికాని యువతులకే అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 2019 జూలై 9న నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 51 పోస్టులున్నాయి. ఇంటర్ లేదా 12వ తరగతి పాసైనవాళ్లు క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. www.airindiaexpress.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాటిని పూర్తిచేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జతపర్చాలి. రూ.500 డీడీ తీసుకోవాలి. ఇంటర్వ్యూ రోజున నేరుగా దరఖాస్తు ఫామ్ అందించాల్సి ఉంటుంది. జూలై 9న పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్, గతంలో పనిచేసిన కంపెనీలకు సంబంధించిన రిఫరెన్సుల ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య ఖర్చవుతుంది. ఆ ఖర్చుల్ని అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. ఇంకా ఏవైనా పరీక్షలు ఉన్నా వాటి ఖర్చులు అభ్యర్థులవే. ఉద్యోగానికి ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు రూ.10,000 స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. నెలకు రూ.36,630 వేతనం పొందొచ్చు.

Air India Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం ఖాళీలు: 51 క్యాబిన్ క్రూ పోస్టులు (అమ్మాయిలకు మాత్రమే)

అర్హత: ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ కావాలి.
అనుభవం: B737 NG/ MAX విమానాల్లో క్యాబిన్ క్రూ ఉద్యోగంలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి.
వయస్సు: 2019 జూలై 1 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీలకు మూడేళ్ల సడలింపు.


ఎత్తు: 157.5 సెంటీమీటర్లు(5 అడుగుల 2 అంగుళాలు) / BMI -18 -22
Loading...
ఇంటర్వ్యూ తేదీ: 2019 జూలై 9
సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఇంటర్వ్యూ జరిగే స్థలం: The Gateway Hotel, Calicut, Pt Usha road, Calicut, Pin -673032

క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు ఎయిర్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

EWS Quota: విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌కు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...