Air India Jobs: ఎయిర్ ఇండియాలో క్లర్క్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు

Air India Recruitment 2019 | వాక్-ఇన్-ఇంటర్వ్యూలు మే 03, 04, 10, 11వ తేదీల్లో ఉంటాయి. ఇంటర్వ్యూ రోజున ఉదయం 10 గంటల్లోపు ఆఫీసుకి చేరుకోవాలి.

news18-telugu
Updated: May 2, 2019, 11:59 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో క్లర్క్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో క్లర్క్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
news18-telugu
Updated: May 2, 2019, 11:59 AM IST
విమానయాన సంస్థలో పనిచేయాలనుకునేవారికి శుభవార్త. అకౌంట్స్ క్లర్క్, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎయిర్ ఇండియా. మొత్తం 61 ఖాళీలున్నాయి. అందులో అకౌంట్స్ క్లర్క్ పోస్టులు 36 కాగా, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు 25 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్‌కు నెలకు రూ.25,200, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్‌కు నెలకు రూ.45,000 వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూలు మే 03, 04, 10, 11వ తేదీల్లో ఉంటాయి. ఇంటర్వ్యూ రోజున ఉదయం 10 గంటల్లోపు ఆఫీసుకి చేరుకోవాలి. ఇంటర్వ్యూ జరిగే స్థలం, తేదీల కోసం ఈ చార్టు చూడండి.

Air India Jobs, Air India Recruitment 2019, Air India Accounts Executive Jobs, Air India Accounts Clerk posts, Latest jobs, Job notifications, ఎయిర్ ఇండియా జాబ్స్, ఎయిర్ ఇండియా ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2019, ఎయిర్ ఇండియా అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్ జాబ్స్, ఎయిర్ ఇండియా అకౌంట్స్ క్లర్క్ పోస్ట్స్, తాజా ఉద్యోగాలు, లేటెస్ట్ జాబ్స్, జాబ్ నోటిఫికేషన్
image: Air India

Air India Recruitment 2019: విద్యార్హతలు



అకౌంట్స్ క్లర్క్: సీఏ ఇంటర్ / ఐసీడబ్ల్యూఏ ఇంటర్ లేదా బీకామ్. SAP(ఎయిర్‌లైన్ అకౌంటింగ్‌)లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. ఐటీ సిస్టమ్స్ ఆఫ్ ఫైనాన్స్ డొమైన్ ఉంటే ప్రాధాన్యత.
అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ-ఫైనాన్స్(ఫుల్ టైమ్). రెండేళ్ల అనుభవం. ఐటీ సిస్టమ్స్ ఉంటే ప్రాధాన్యత.



Read this: RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

Air India Recruitment 2019: ఖాళీల వివరాలివే...

అకౌంట్ క్లర్క్- 36 పోస్టులు
ఢిల్లీ-11
ముంబై-09
కోల్‌కతా-02
చెన్నై-01
హైదరాబాద్-01
బెంగళూరు-01

అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్-25 Posts
ఢిల్లీ-14
ముంబై-14
కోల్‌కతా-03
చెన్నై-03
హైదరాబాద్-01
బెంగళూరు-01

ఎయిర్ ఇండియాలో అకౌంట్స్ క్లర్క్, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

Realme Sale: రియల్‌మీ యానివర్సరీ సేల్... ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్స్, బ్యాక్‌ప్యాక్స్

Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

Flipkart Sale: రూ.13,990 ధరకే ల్యాప్‌టాప్, టీవీలపైనా ఆఫర్లు
First published: May 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు