Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 జాబ్స్... సెప్టెంబర్ 9 నుంచి ఇంటర్వ్యూలు

Air India Jobs 2019 | ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ దరఖాస్తులో చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు దరఖాస్తు ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.

news18-telugu
Updated: September 7, 2019, 10:16 AM IST
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 జాబ్స్... సెప్టెంబర్ 9 నుంచి ఇంటర్వ్యూలు
Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 జాబ్స్... సెప్టెంబర్ 9 నుంచి ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 7, 2019, 10:16 AM IST
కస్టమర్ ఏజెంట్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్, అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్స్ లాంటి పోస్టుల భర్తీ చేపట్టింది ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-AIATSL. మొత్తం 214 ఖాళీలున్నాయి. వీటిని ముంబై స్టేషన్ కోసం భర్తీ చేస్తోంది AIATSL. మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులివి. వీటికి సెప్టెంబర్ 9, 13, 14 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ దరఖాస్తులో చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు దరఖాస్తు ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో చదివి తెలుసుకున్న తర్వాత వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. దరఖాస్తు ఫామ్‌ను airindia.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పలు పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్‌, ఇంటర్వ్యూ తేదీల వివరాలు తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AIATSL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 214

కస్టమర్ ఏజెంట్- 100
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ హ్యూమన్ రీసోర్స్ / అడ్మినిస్ట్రేషన్- 08
అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్స్ / అడ్మినిస్ట్రేషన్- 06


హ్యాండీమ్యాన్- 100
Loading...
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీ: 2019 సెప్టెంబర్ 9, 13, 14
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
Systems & Training Division 2nd floor,
GSD Complex, Near Sahar Police Station,
Airport Gate No.-5, Sahar,
Andheri-E, Mumbai-400099

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ ఉద్యోగాలు

Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...